బీజేపీ హయాంలో 6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగింది

బీజేపీ హయాంలో 6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగింది

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ హయాంలో రూ.6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగిందని ఆప్ ఆరోపించింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా లెటర్ రాశారు. ప్రతిరోజు ఢిల్లీకి వచ్చే 10 లక్షల కమర్షియల్ వెహికల్స్ నుంచి వసూలు చేసిన సొమ్మును పక్కదారి పట్టించారని అందులో పేర్కొన్నారు.

రెండు సంస్థలతో బీజేపీ నేతలు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘టోల్ ట్యాక్స్ కలెక్షన్స్ లో పెద్ద స్కామ్ జరిగింది. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేస్తే సీనియర్ బీజేపీ లీడర్లు, మున్సిపల్ అధికారులు జైలుకు వెళ్తారు” అని ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ అన్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఫ్రస్ట్రేషన్​తో 
ఆప్ ఆరోపణలు చేస్తోందంది.