కేజ్రీవాల్ను అడ్డు తొలగించుకోవాలని బీజేపీ కుట్ర: మనీష్ సిసోడియా

కేజ్రీవాల్ను అడ్డు తొలగించుకోవాలని బీజేపీ కుట్ర: మనీష్ సిసోడియా

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ఉన్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అయితే బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఆమ్ ఆద్మీ పార్టీ భయపడదని మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. మనోజ్ తివారీ ఉదయం చేసిన ట్వీట్ పై స్పందించిన సోసిడియా ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేజ్రీవాల్ భద్రత గురించి ఆందోళనగా ఉందంటూ శుక్రవారం మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. అవినీతి ఆరోపణలు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవడం గురించి ప్రస్తావించిన ఆయన ఈ కామెంట్ చేశారు. అత్యాచార నిందితులతో ఫ్రెండ్షిప్, జైలులో మసాజ్ ఘటనలపై ఆప్ వాలంటీర్లు ఆగ్రహంతో ఉన్నారని తివారీ అభిప్రాయపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలపై జరుగుతున్నట్లుగానే సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడులు జరగొద్దని కోరుకుంటున్నానని మనోజ్ తివార్ ట్వీట్లో రాసుకొచ్చారు.