మంజీరా పైప్ లైన్ లీక్.. వృధాగా పోతున్న నీరు

మంజీరా పైప్ లైన్ లీక్.. వృధాగా పోతున్న నీరు

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు అందించే మంజీర పైప్ లైన్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో లీకైంది. దీంతో  నీరు పెద్ద ఎత్తున వృధాగా పోతుంది.  బీరంగూడ కమాన్, జ్యోతినగర్, శ్వేతా గార్డెన్ దగ్గర మంజీరా పైప్ లైన్ లీకై.. భారీగా నీరు ఎగిసి పడుతుంది. దీంతో  ఆయా కాలనీల్లోని షాపులు నీట మునిగిపోయాయి. నీరు షాపుల్లోకి చేరడంతో....దుకాణదారులు విలువైన వస్తువులు తీసుకుని బయటపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని దుకాణదారులు వాపోయారు. నష్ట పరిహారం అందించి సాయం చేయాలని ఆయా కాలనీల ప్రజలు, దుకాణదారులు కోరుతున్నారు.