వీకెండ్ ఈ సిరీస్ అసలు వదులొద్దు: OTTలో దూసుకెళ్తోన్న ఇండియా మోస్ట్ అవైటెడ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్ సిరీస్

వీకెండ్ ఈ సిరీస్ అసలు వదులొద్దు: OTTలో దూసుకెళ్తోన్న ఇండియా మోస్ట్ అవైటెడ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్ సిరీస్

ఇండియన్ వెబ్ సిరీసుల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిల్లో ‘ది ఫ్యామిలీ మేన్’ (The Family Man) సిరీస్ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్స్ రాగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం (2025 నవంబర్ 21న) థర్డ్ సిరీస్.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. పాన్ ఇండియా భాషలతో పాటుగా వరల్డ్ వైడ్గా స్ట్రీమింగ్కి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 మూవీస్లో ఒకటిగా దూసుకెళ్తోంది.

మనోజ్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. ఇందులో గూఢచారి పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీకాంత్ తివారీగా మనోజ్ కనిపించాడు. పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ నటుడు జైదీప్‌‌‌‌ అహ్లావత్‌‌‌‌ కీలక పాత్ర పోషించాడు. ఓ వైపు దేశాన్ని కాపాడే స్పై ఏజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మరోవైపు మిడిల్ క్లాస్ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గత రెండు సీజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మనోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటన ఎంతో ఆకట్టుకుంది. ఇక అతనికి భార్యగా ప్రియమణి నటించింది. రెండో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమంత కీ రోల్ చేసింది. ఇక పార్ట్ 3లో విజయ్ సేతుపతి, సందీప్ కిషన్,  షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, ఆశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కథేంటంటే:

శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌‌‌‌పేయి), సుచి (ప్రియమణి)ల కాపురంలో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. అదే టైంలో ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతాయి. ప్రధాని బసు (సీమా బిశ్వాస్‌‌‌‌) శాంతిని నెలకొల్పి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ప్రాజెక్ట్‌‌‌‌ సహకార్‌‌‌‌’ను ప్రవేశపెడతారు. కానీ.. అక్కడి రెబల్‌‌‌‌ గ్రూప్స్‌‌‌‌ ఈ ప్రాజెక్ట్‌‌‌‌ని వ్యతిరేకిస్తాయి. అందుకే ప్రభుత్వం వాళ్లతో చర్చలు జరిపి, ఒప్పించే బాధ్యతను థ్రెట్‌‌‌‌ అనాలసిస్‌‌‌‌ అండ్‌‌‌‌ సర్వైలెన్స్‌‌‌‌ సెల్‌‌‌‌ (టాస్క్)కు అప్పగిస్తుంది.

టాస్క్‌‌‌‌లో పనిచేసే శ్రీకాంత్‌‌‌‌ తివారీ తన సీనియర్‌‌‌‌ అధికారి కుల్‌‌‌‌కర్ణి (దలిప్‌‌‌‌ తాహిల్‌‌‌‌)తో నాగాలాండ్‌‌‌‌కు బయల్దేరుతారు. కొందరు ఆ చర్చలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే డ్రగ్స్​ స్మగ్లర్‌‌‌‌‌‌‌‌ రుక్మా (జైదీప్ అహ్లావత్) వాళ్ల కాన్వాయ్‌‌‌‌పై మెరుపుదాడి చేస్తాడు. ఆ దాడిలో రెబల్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ నాయకుడితో పాటు, కుల్‌‌‌‌కర్ణిని కాల్చి చంపేస్తారు.

శ్రీకాంత్‌‌‌‌ గాయాలతో బయటపడతాడు. కానీ.. ‘టాస్క్‌‌‌‌’ ఆ దాడికి కారణం శ్రీకాంత్‌‌‌‌ అని ముద్రవేస్తుంది. కుల్‌‌‌‌కర్ణి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చి, అరెస్ట్‌‌‌‌ వారెంట్‌‌‌‌ జారీ చేస్తుంది. దాంతో శ్రీకాంత్‌‌‌‌ కుటుంబంతో సహా ముంబయి నుంచి పారిపోతాడు. చర్చలు జరగకుండా అడ్డుకున్నది ఎవరు? దానివల్ల లాభం ఏంటి? తెలుసుకోవాలంటే సిరీస్‌‌‌‌ చూడాలి. 

ఎలా ఉందంటే:

గత రెండు సీజన్లలో ఉగ్రవాదులు, ఎల్టీ సభ్యుల నుంచి దేశానికి వచ్చే ముప్పును తప్పించేందుకు టాస్క్‌ సీనియర్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ తివారీ, అతడి టీమ్‌ చేసిన సాహసాలను చూపించారు. మూడో సీజన్‌లోనూ ఆ ఫార్ములాను కొనసాగిస్తూనే ప్రభుత్వం దృష్టిలో హీరోనే మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా మార్చారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెబల్ గ్రూప్స్‌ని అడ్డుపెట్టుకుని చైనా ఎలాంటి రాజకీయాలు చేస్తోంది. ప్రధానమంత్రి పక్కనుండే వాళ్లు ఇచ్చే సలహాల వల్ల అటు ప్రజలు, ఇటు ఆర్మీ.. ఎలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో చిక్కుకుంది. కథ, కథనాలను ఆ దృష్టి కోణం నుంచి నడిపి సిరీస్‌ను రక్తికట్టించే ప్రయత్నం చేశారు డైరెక్టర్స్ రాజ్‌ అండ్‌ డీకే.

టాస్క్‌ సభ్యులపై రుక్మా దాడి చేయడం, ఈ క్రమంలో కుల్‌కర్ణి చనిపోవడం, శ్రీకాంత్‌ గాయాలతో బయటపడటం వంటి సీన్స్ ఆడియన్స్ కి మరింత కనెక్ట్‌ అయ్యేలా తీర్చిదిద్దిన విధానం బాగుంది. గత రెండు సీజన్లలో శ్రీకాంత్ తివారీ చేసే అడ్వెంచర్స్, ఫ్యామిలీ డ్రామా, కొడుకు, కూతురు చేసే హంగామా, తోటి ఉద్యోగి జేకే చేసే కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్‌గా ఉండేవి. అయితే, ఈ సీజన్‌లో మాత్రం శ్రీకాంత్ తివారీ పాత్ర నుంచి అవి మిస్ అయిపోయాయి. స్టోరీతో పాటు వెళ్లడం వల్ల శ్రీకాంత్ పాత్ర ఎలాంటి అడ్వెంచర్స్ చేయడానికి వీలుపడదు.

కానీ, NIAకు చిక్కకుండా శ్రీకాంత్‌ వేసే ప్లాన్‌, ట్రైన్‌ ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ఇకపోతే, డైరెక్టర్స్ రాజ్-డీకే తీసిన 'ఫర్జీ' సిరీస్‌లోని మైకేల్ వేదనాయగంగా (విజయ్ సేతుపతి) పాత్ర.. కీలక సమయంలో శ్రీకాంత్ తివారీ పాత్రకు సహాయపడుతుంది. కాగా ఈ థ్రిల్లర్ సిరీస్‌ మొత్తం 7 ఎపిసోడ్స్‌తో స్ట్రీమ్ అవుతోంది.  నిడివి దాదాపు 6గంటలు పైనే. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ ఎంచక్కా ఎంజాయ్ చేయండి.