టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు, రోషన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `ఛాంపియన్` (Champion). దర్శకుడు ప్రదీప్ అద్వైతం పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి. మలయాళి బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.
నిజాం కాలం నాటి కథాంశంతో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం జనవరి 29 (గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. స్వాతంత్ర్యం అనంతర భారతదేశం నేపథ్యంలో, నిజాం పాలనలోని రాజాకార్ వ్యవస్థను ప్రతిబింబించేలా ఈ సినిమాను రూపొందించారు.
ALSO READ : మ్యాడ్ తరువాత మరో మ్యాజిక్?
చారిత్రక నేపథ్యానికి స్పోర్ట్స్ అంశాన్ని జోడిస్తూ, భావోద్వేగాలు, యాక్షన్‌ను సమన్వయం చేసిన విధానానికి దర్శకుడు ప్రదీప్ అద్వైతం ప్రశంసలు అందుకున్నారు. ఇది ఒక నిజాయితీగల ప్రయత్నంగా ప్రేక్షకులు, విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే థియేటర్లలో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో, ఓటీటీ వేదికపై ‘ఛాంపియన్’ ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాల్సిందే.
Football ground ki champion kaani rangam lo… sainikudu 🏆💪 pic.twitter.com/4MLXtY6YnT
— Netflix India South (@Netflix_INSouth) January 24, 2026
కథేంటంటే:
మైఖేల్ సి.విలియమ్స్ (రోషన్) సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా ఇంగ్లాండ్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. దానికి ఫుట్‌బాల్ ఆట ఒక్కటే సరైన మార్గం అని భావిస్తాడు. ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని కఠోర శ్రమలో నిమగ్మవుతాడు. ఈ క్రమంలోనే మైఖేల్ ధ్యేయానికి అతడి తండ్రి వీరత్వం అడ్డంకిగా నిలుస్తుంది. అలా అతను ఇంగ్లాండ్ వెళ్లాలంటే, బీదర్లో తుపాకులు డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, బీదర్ వెళ్లాల్సిన మైఖేల్.. తుపాకులు ఉన్న ట్రక్కుతో పాటు బైరాన్ పల్లిలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనలతో మైఖేల్ జీవితం పూర్తిగా మలుపు తిరుగుతుంది
ALSO READ : రూ.200 కోట్ల బడ్జెట్ గాసిప్‌కు చెక్..
ఇంతకీ మైఖేల్ తుపాకులను ఎందుకు డెలివరీ చేయాల్సి వచ్చింది? అతని తండ్రి చేసిన తప్పిదం ఏమిటి? బైరాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకున్న సమస్యలు ఏమిటి? ఆ సమస్యలకు అండగా ఉండటం కోసం మైకేల్ ఏం చేశాడు? మైఖేల్పై ఉన్న పగతో నిజాం పోలీస్ ఆఫీసర్, బాబు దేశ్ ముఖ్ (సంతోష్ ప్రతాప్) ఏం చేస్తాడు? భైరాన్ పల్లి ప్రజలు నిజాం ఆఫీసర్స్, రజాకార్లను ఎలా ఎదుర్కొన్నారు? ఇందులో చంద్రకళ (అనశ్వర రాజన్) పాత్ర ఏమిటి? చివరికి మైఖేల్ ఇంగ్లాండ్ వెళ్లాడా ? లేదా అన్నదే మిగతా కథ.
రోషన్ నెక్స్ట్ మూవీ:
రోషన్ ప్రస్తుతం కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన మరియు మీడియం రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన రోషన్, ఈసారి ఓ పవర్‌ఫుల్ డైరెక్టర్‌తో చేతులు కలపనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ALSO READ : స్పెన్స్ థ్రిల్లర్‌గా అనుపమ పరమేశ్వరన్ ‘లాక్‌డౌన్’..
క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో హిట్ ఫ్రాంచైజీతో వరుస విజయాలు సాధించిన దర్శకుడు శైలేష్ కొలను, రోషన్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు ఇంటెన్స్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శైలేష్ కొలను, ఈసారి పూర్తిగా తన రూట్ మార్చి రోషన్‌తో ఓ లవ్ స్టోరీ తెరకెక్కించబోతున్నారట. అంతేకాదు ఇది లవ్ స్టోరీతో పాటు స్పై థ్రిల్లర్ జానర్లో ఉంటుందని కూడా మరో టాక్. ఈ సినిమాలో రోషన్ ఏజెంట్గా కనిపిస్తాడని, సీతారామం తరహాలో సాగే ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది.
హిట్ 1, హిట్ 2, హిట్ 3 అలాగే సైంధవ్ సినిమాలతో తనలోని ఇంటెన్సిటీని చూపించిన శైలేష్, ఫస్ట్ టైమ్ ప్రేమకథను తెరకెక్కించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ భారీగా పెరిగింది. ఇప్పటికే కథ లాక్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. రోషన్ సరసన కన్నప్ప సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రీతి ముకుందన్ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.
