జ‌మ్ముక‌శ్మీర్ తొలి గ‌వ‌ర్న‌ర్ రాజీనామా.. రెండో గవర్నర్‌గా మ‌నోజ్ సిన్హా

జ‌మ్ముక‌శ్మీర్ తొలి గ‌వ‌ర్న‌ర్ రాజీనామా.. రెండో గవర్నర్‌గా మ‌నోజ్ సిన్హా

జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా నియామ‌కం అయ్యారు. ఆయనను గ‌వ‌ర్న‌ర్‌గా నియమిస్తూ.. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులిచ్చారు. జ‌మ్ముక‌శ్మీర్ కు తొలి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా పనిచేసిన గిరీష్ చంద్ర ముర్ము రాజీనామా చేయడంతో.. ఆ స్థానంలో మనోజ్ సిన్హా నియమితులయ్యారు. మనోజ్ సిన్హా గతంలో భారతీయ రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. బీజేపీ నుంచి మూడుసార్లు పార్లమెంట్ మెంబర్ గా కూడా ఎన్నికయ్యారు.

ప్రస్తుత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌)గా ఉన్న రాజీవ్‌ మెహెర్షి ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలోకి ముర్మును తీసుకోనున్నట్లు సమాచారం. అందుకే ముర్ము తన రాజీనామాను రాష్ట్రపతికి అందజేశారు. ముర్ము రాజీనామాను పరిశీలించిన రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు. జమ్మూ కశ్మీర్ ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించిన తర్వాత అక్టోబర్ 31, 2019లో ఆ రాష్ట్ర తొలి గవర్నర్ గా ముర్ము నియ‌మి‌తు‌ల‌య్యారు. ముర్ము గుజరాత్ కేడర్‌లోని 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన కార్యదర్శిగా ముర్ము ప‌నిచేశారు.

For More News..

లాలూను రిమ్స్ నుంచి తరలించిన అధికారులు.. కారణమదేనా?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత