పెయింటింగ్ వేయడంలో ప్రత్యేకత.. యువకుడికి ఆనంద్ మహీంద్రా మెచ్చుకోలు

పెయింటింగ్ వేయడంలో ప్రత్యేకత.. యువకుడికి ఆనంద్ మహీంద్రా మెచ్చుకోలు

న్యూఢిల్లీ: కష్టించి పని చేస్తున్నాం.. ఎంత చెమటోడ్చానో తెలుసా? లాంటి మాటలు ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి. అయితే కొందరు మాత్రం వీటికి మినహాయింపుగా ఉంటారు. హార్డ్‌వర్క్ కంటే స్మార్ట్‌వర్క్‌ను ఎక్కువగా నమ్ముతారు. చిన్నపాటి మార్పులతో శ్రమిస్తూ సమయంతో పాటు పని చేసే విధానాన్ని కూడా మార్చేస్తారు. ఇలాంటి వారిని ప్రముఖులు కూడా మెచ్చుకుంటారు. తాజాగా ఓ యువకుడు రూమ్‌లో పెయింట్ అందంగా వచ్చేందుకు ఐరన్ షీట్‌ను ఉపయోగిస్తూ సులభంగా పని చేసిన వీడియోను బిజినెస్‌ టైకూన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

సదరు వీడియోలో పెయింటర్ రూమ్‌కు పెయింట్ వేస్తూ కనిపించాడు. అయితే అతడు పెయింట్ వేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘అది గ్లామరస్ వర్క్ కాదు. దీంట్లో ఎలాంటి రాకెట్ సైన్స్‌ లేదు. అయితే నాణ్యత లేని పెయింట్‌ను అది తొలగిస్తుంది. ఇలాంటి మార్పులు నిత్యం చేసే అలుపెరుగని పనులను తేలికగా చేస్తాయి. అలాగే ఉత్పాదకత పెరిగేలా చేస్తాయి. సాధారణ పద్ధతుల్లో కనుగొనే పరిష్కారాలు మనోహరమైనవి’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. సివిల్ ఇంజినీరింగ్‌ అనే ట్విట్టర్ ప్రొఫైల్ పోస్ట్‌ చేసిన ఈ వీడియోను ఆనందర్ మహీంద్రా రీపోస్ట్‌ చేశారు.