దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు రూ.5,555 కోట్ల భరణం

దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు రూ.5,555 కోట్ల భరణం

సెలబ్రేటీ జంటలు విడిపోతే పెద్ద మొత్తంలో భరణం ఇవ్వడం చూస్తుంటాం. అలాంటిదే దుబాయ్ రాజు విషయంలో జరిగింది. కానీ ఇది ఏ యాభై, వంద కోట్లో కాదు. ఏకంగా రూ. 5,555 కోట్లు. దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం (72) విషయంలో బ్రిటన్ హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. తన మాజీ భార్య, జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుస్సేన్ (47)కు.. వీళ్లిద్దరికీ పుట్టిన పిల్లలకు రూ.5,555 కోట్లు (554 మిలియన్ పౌండ్లు) కట్టితీరాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. దీన్ని బ్రిటిష్ చరిత్రలో అత్యంత ఖరీదైన భరణంగా చెబుతున్నారు. 

మొత్తం భరణంలో రూ.2,521 కోట్లు మాజీ భార్యకు మూడు నెలల్లోగా చెల్లించాలని కోర్టు తెలిపింది. మిగిలిన మొత్తాన్ని వీరి పిల్లలైన అల్ జలీలా (14), జయేద్ (9)కు బ్యాంకు గ్యారెంటీతో చెల్లించాలని స్పష్టం చేసింది. మాజీ భార్య, పిల్లల (మైనారిటీ పూర్తయ్యేదాకా) బాధ్యత కింద ఏటా రూ.110 కోట్లతోపాటు పిల్లల చదువు కోసం మరికొంత డబ్బును పెద్ద మొత్తంలో కలిపారు. రాకుమారి హయా, ఆమె పిల్లలకు బయటి శక్తుల కంటే భర్త మహ్మద్ నుంచే ఎక్కువ ముప్పు పొంచి ఉందని, అందుకు ఆమెకు తగిన రక్షణ అవసరమని న్యాయమూర్తి ఫిలిప్ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తల కోసం: 

కేసులు పెరిగితే స్కూళ్ల మూసివేతపై నిర్ణయం!

ఈ జీప్ కిక్ కొడితే స్టార్ట్ అయితది

రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్ చేసిన హత్యలే