ఈ జీప్ కిక్ కొడితే స్టార్ట్ అయితది

ఈ జీప్ కిక్ కొడితే స్టార్ట్ అయితది

న్యూఢిల్లీ: కిక్ కొడితే స్టార్ట్ అయ్యే టూ వీలర్లను చూసుంటాం. కానీ కిక్ కొట్టి ఆన్ చేసే ఫోర్ వీలర్లను చూశారా? ఫోర్ వీలర్ కు కిక్ కొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మహారాస్ట్రకు చెందిన దత్తాత్రేయ లోహర్ దీన్ని నిజం చేశాడు. ఇంట్లో ఉన్న స్క్రాప్ మెటీరియల్ తో ఓ జీపును రూపొందించాడు. దీనికి సుమారు రూ. 60 వేలు ఖర్చయిందంట. ప్యాషన్ బైక్ ఇంజన్ తో దీన్ని తయారు చేశాడు. కిక్ కొడితే స్టార్ట్ అవ్వడం దీని ప్రత్యేకత. ఈ జీప్ వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతోంది. ఒక యూట్యూబర్ పోస్టు చేసిన ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త, మహింద్ర సంస్థ అధినేత ఆనంద్ మహింద్ర కంట పడింది. జీపు స్పెషాలిటీ, దాన్ని రూపొందించిన తీరుకు ఫిదా అయిన ఆయన.. ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. 

ఈ జీపును చూస్తుంటే తనకు ముచ్చటేస్తోందని ఆనంద్ మహింద్రా అన్నారు. పరిమిత వనరులు, తక్కువ సామర్థ్యంతోనే అద్భుతాలు చేయడం గొప్ప విషయమన్నారు. అయితే రూల్స్ కు తగ్గట్లుగా లేదని ఈ వాహనాన్ని అధికారులు పట్టుకునే అవకాశం ఉందని.. కాబట్టి ఈ జీపుకు బదులుగా దత్తాత్రేయకు కొత్త బొలెరోను ఫ్రీగా ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఈ జీపును మహింద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతానని వెల్లడించారు. ఇది ఎల్లప్పుడూ తమకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్ చేసిన హత్యలే

నేను విప్లవకారుడ్ని.. ప్రశ్నించడానికి భయపడను

మా పేదల కోసం సర్కారు ఏం చేస్తోంది?