చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నెల 29న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు.. కేరళలో పూర్తిగా కర్నాటక, తమిళనాడులోని  కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2 నుంచి 3 రోజుల్లో కర్నాటకలోని మరికొన్ని ప్రాంతాలు, కొంకణ్, గోవా, తమిళనాడు అంతటా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల ఉత్తర పరిమితి కార్వార్, చిక్ మంగళూరు, బెంగళూరు, ధర్మపురి మీదుగా వెళ్తోందని చెప్పింది.

రుతుపనాల ప్రభావంతో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు చెప్పింది. 

మరిన్ని వార్తల కోసం..

వెదర్ అలర్ట్: రాష్ట్రానికి భారీ వర్ష సూచన

బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు