త్రిషకు సారీ చెప్పను..మీకే టైం ఇస్తున్న..నడిగర్ సంఘానికి మన్సూర్ కౌంటర్!

త్రిషకు సారీ చెప్పను..మీకే టైం ఇస్తున్న..నడిగర్ సంఘానికి మన్సూర్ కౌంటర్!

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) ఇటీవల హీరోయిన్ త్రిష(Trisha)పై  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీనీ ప్రముఖులంతా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. దీంతో సినీ వర్గాలంతా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం అతనిపై తాత్కాలికంగా నిషేధం విధించింది. దీంతో మన్సూర్ సారీ చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్ చేస్తుండగా..తాను అసలు క్షమాపణలు చెప్పేది లేదని..తప్పుగా మాట్లాడలేదని తెగేసి చెబుతున్నారు.

అంతేకాకుండా, నడిగర్ సంఘం నాపై నిషేధం విధించి చాలా తప్పు చేసిందని..నా నుంచి వివరణ కోరితే బాగుండని తెలిపారు. అలాగే..నడిగర్ సంఘం నిషేదాన్ని వెనక్కి తీసుకోవడానికి మీకే టైం ఇస్తున్న..సోషల్ మీడియాలో వార్తలు ఎలా అయిన రావొచ్చు. కానీ తమిళ ప్రజలకు నేనంటనేది తెలుసు. ఇకపోతే సినిమాల్లో రేప్ సీన్ ఉంటే నిజంగా ఎవరైనా రేప్ చేస్తారా? అసలు బుద్దుందా? నేనేమీ తప్పుగా మాట్లాడలేదని..త్రిషకు క్షమాపణలు చెప్పబోనని మన్సూర్ స్పష్టం చేశారు.