భారత మహిళా షూటర్ మను భాకర్ ప్రపంచ కప్ ఫైనల్స్ జూనియర్ విభాగంలో ప్రపంచ రికార్డును సృష్టించి గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. చైనాలో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ చివరి టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ(గురువారం) మహిళల విభాగంలో జరిగిన 10 మీటర్ల కేటగిరీ ఎయిర్ పిస్టల్ పోటీలో మను గోల్డ్ మెడల్ సాధించింది. 244.7 పాయింట్లు సాధించి మెడల్ ను చేజిక్కించుకుంది.
ఈ పోటీలో సెర్బియాకు చెందిన జోరానా అరునోవిక్ 241.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా… చైనా యువతి క్వియాన్ వాంగ్ 221.8 పాయింట్ల మూడో స్థానం దక్కించుకుంది. మరో ఇండియన్ ప్లేయర్ యశస్విని సింగ్ దేవల్ ఇదే ఈవెంట్‌లో ఆరో స్థానంలో నిలిచింది.

