
శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్స్. జూన్ 23న సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఇంటెన్స్‌గా, ప్రామిసింగ్‌గా ఉంది. లవ్ యాక్షన్ జానర్ నా ఫేవరేట్. థియేటర్స్‌లోని ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు.
శివ కందుకూరి మాట్లాడుతూ ‘ప్రతి నటుడు తన సినిమాలో ఫైట్స్, డ్యాన్స్, మాస్ పాట ఉండాలనుకుంటారు. ఇవన్నీ నాకు ‘మను చరిత్ర’ కంప్లీట్ చేసింది. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు’ అన్నాడు. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూసి తమను సపోర్ట్ చేయాలని కోరింది మేఘా ఆకాష్. ఇందులోని ప్రతి ఒక్కరి పాత్ర అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పాడు భరత్. నిర్మాత రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.