మెగా ప్రిన్స్కు జోడిగా మానూషి ఛిల్లర్

మెగా ప్రిన్స్కు జోడిగా మానూషి ఛిల్లర్

మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్, డైరెక్టర్​ ప్రవీణ్​ సత్తారు కాంబినేషన్​లో 'గాండీవధారి అర్జున' సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కాంప్లీట్ కాకముందే V13లో వరుణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్​కు జోడిగా మాజీ మిస్​ వరల్డ్ ​మనూషి ఛిల్లర్​ను తీసుకున్నారు. వరుణ్​తేజ్​ సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్​ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్​ షెడ్యూల్​లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సామ్రాట్​ పృథ్వీరాజ్ సినిమాతో కెరీర్ స్టార్ట్​ చేసిన మనూషి.. ది గ్రేట్ ​ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో యాక్ట్​ చేసింది. తెరహాన్​ అనే మారో మూవీలోనూ నటిస్తోంది. ఇప్పడు టాలీవుడ్​ లోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇక VT13 చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తున్నాడు. సోనీ పిక్చర్స్రె–నాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని తెరకెక్కిస్తున్న VT13 ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.