వెంటిలేటర్స్ సపోర్ట్ ఆలస్యమవ్వటంతోనే

వెంటిలేటర్స్ సపోర్ట్ ఆలస్యమవ్వటంతోనే

బీజింగ్: చైనా కరోనా కారణంగా చనిపోయిన వారిలో ఎక్కువ మందికి వెంటిలేటర్ సపోర్ట్ సరైన సమయానికి అందలేదంట. సరైన సమయానికి వెంటిలేటర్ అందుబాటులో ఉన్న 5 పేషెంట్లలో ఒకరు మాత్రమే చనిపోయారంట. కావాల్సినన్నీ వెంటిలేటర్లు అందుబాటులో ఉంటే చాలా మంది చనిపోయే వారు కాదని ఓ స్టడీలో తేలింది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్స్ ఈ స్టడీలోని అంశాలను ప్రచురించింది. చైనా లోని వుహాన్ లో 21 హాస్పిటల్స్ చనిపోయిన 168 మంది పేషెంట్లకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను అధ్యయనం చేశారు. జనవరి 21 నుంచి 30 తేదీల్లో వీరంతా కరోనా ఎఫెక్ట్ తో మృతి చెందారు. వీరిలో 46 మందికి మాత్రమే చనిపోయే ముందు వెంటిలేటర్ల సహాయం అందిందని గుర్తించారు. మిగతా వారందరికీ ఆక్సిజన్ థెరపీ చేసినప్పటికీ వారు చనిపోయే ముందు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడగా ఆ సమయంలో వారికి వెంటిలేటర్ అందుబాటులో లేదంట. 72 మంది పేషెంట్లు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. మరో 34 మంది పేషెంట్లకు లేటుగా వెంటిలేటర్ల సపోర్ట్ ఇచ్చినప్పటికీ వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది పేషెంట్ల బ్లడ్ లో ఆక్సిజన్ లెవల్స్ లో గా ఉండటం తప్ప మిగతా ఏ సమస్య లేదని అధ్యయనంలో తేలింది. అంటే వెంటిలేటర్లు సమయానికి అందించి ఉంటే ఎక్కువ మంది బ్రతికేవారంట. ఇక కరోనాతో చనిపోయిన వారిలో కామన్ గా హై బీపీ ఉన్నట్లు కూడా ఈ స్టడీలో తేలింది.