విదేశాల్లో లిస్టింగ్‌‌‌‌ అయ్యేందుకు  అనుమతివ్వండి

విదేశాల్లో లిస్టింగ్‌‌‌‌ అయ్యేందుకు  అనుమతివ్వండి

న్యూఢిల్లీ: తమ బిజినెస్‌ను మరింత పెంచుకోవడానికి వీలుగా నేరుగా విదేశీ స్టాక్స్ ఎక్స్చేంజిల్లో లిస్టింగ్‌‌‌‌కు అవకాశం ఇవ్వాలని పలు ఇండియన్ స్టార్టప్ లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరాయి. ఈ మేరకు ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులతో పాటు 22 స్టార్టప్‌‌‌‌ల ఫౌండర్లు మోడీకి లెటర్ రాశారు.  స్విగ్గీ, అర్బన్ కంపెనీ, క్రెడ్, ఇన్‌‌‌‌ఫ్రా, మార్కెట్, బైజుస్  అనాకాడెమీ సీఈవోలు లెటర్ రాసిన వారిలో ఉన్నారు. సికోవియా క్యాపిటల్, యాక్సెల్, లైట్‌‌‌‌స్పీడ్  టైగర్ గ్లోబల్ వంటి ఫండింగ్ పార్టనర్లూ లెటర్‌‌‌‌‌‌‌‌లో సంతకాలు చేశారు. ఫారిన్ లిస్టింగ్‌‌‌‌కు ఓకే చెబితే ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ చాలా స్పీడ్‌‌‌‌గా ఎదుగుతుందని, గ్లోబల్ మార్కెట్లలో స్థానం సంపాదింవచ్చని ప్రధానికి వివరించాయి. స్టార్టప్‌‌‌‌లు మనదేశంలో ఒక టెక్-వేవ్‌‌‌‌ను ఎలా తీసుకొచ్చాయో ఈ లెటర్ ద్వారా వివరించారు. గ్లోబల్ మార్కెట్లలో పోటీపడగల ప్రొడక్టులను తయారు చేశామని పేర్కొన్నారు.  "ఎంతో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ కంపెనీలు మరిన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలంటే మరింత క్యాపిటల్ కావాలి. దీని కోసం డొమెస్టిక్‌‌‌‌తోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్లలో సత్తా చాటాలి. క్యాపిటల్‌‌‌‌  వస్తే మరింత మందికి ఉపాధి కల్పించొచ్చు. అమెరికా వంటి క్యాపిటల్ మార్కెట్లు ఇండియా కంటే చాలా పెద్దవి. అక్కడ లిస్ట్ అయితే మాకు చాలా లాభాలు ఉంటాయి”అని స్టార్టప్ ల ఫౌండర్లు  ఈ లెటర్‌‌‌‌‌‌‌‌లో వివరించారు. 
ప్రభుత్వం ఫారిన్ లిస్టింగ్‌‌‌‌పై పనిచేస్తోంది..
విదేశీ మార్కెట్లలో డైరెక్ట్ లిస్టింగ్ అనే ప్రపోజల్‌‌‌‌పై స్టార్టప్ ఫౌండర్లు చాలాకాలంగా చర్చిస్తున్నారు. యుఎస్ క్యాపిటల్ మార్కెట్లు,  ఇతర విదేశీ మార్కెట్లు మనదేశం కంటే పెద్దవి కాబట్టి భారీగా క్యాపిటల్ సమకూర్చుకోవచ్చు. దేశీ స్టార్టప్‌‌‌‌లను లిస్టింగ్ చేయడానికి అవి అనువుగా ఉంటాయని ఎనలిస్టులు చెబుతున్నారు.  ప్రభుత్వం ఇందుకు తగిన చర్యలు తీసుకొని కంపెనీల ఫారిన్ డైరెక్ట్ లిస్టింగ్‌‌‌‌కి సంబంధించిన పాలసీని రూపొందించాలని ప్రయత్నించాలని కోరాయి. అయితే ఎన్డీయే ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోందని, కంపెనీల విదేశీ లిస్టింగ్‌‌‌‌కు సంబంధించిన విధానాన్ని తదుపరి బడ్జెట్ లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇటీవల తెలిపారు. " ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే కంపెనీల కోసం డైరెక్ట్ లిస్టింగ్ విజయవంతం కావడానికి కొన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది" అని బజాజ్ తెలిపారు. డైరెక్ట్ ఫారిన్ లిస్టింగ్‌‌‌‌కు పర్మిషన్ ఇస్తే ఇండియా స్టార్టప్‌‌‌‌లు భారీగా క్యాపిటల్‌‌‌‌ను సమకూర్చుకోవచ్చని వీటి ఫౌండర్లు చెబుతున్నారు. కంపెనీ ప్రొఫైల్ ను పెంచడంలో కూడా సహాయపడుతుందని, టెక్ కంపెనీల వాల్యుయేషన్ పెరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుత రూల్స్ ప్రకారం అన్‌‌‌‌ లిస్టెడ్‌‌‌‌ కంపెనీలు ఇంటర్నేషనల్ మార్కెట్ల ద్వారా క్యాపిటల్‌‌‌‌ను తీసుకోవడం సాధ్యం కావడం లేదు. దీనివల్ల ఇండియన్ స్టార్టప్‌‌‌‌లు ఎదగలేకపోతున్నాయని ఈ లెటర్లో వివరించారు. గత సెప్టెంబర్‌‌‌‌లో కంపెనీల (సవరణ) బిల్లు 2020 రాజ్యసభ ఆమోదం పొందింది. పబ్లిక్ ఆఫరింగ్‌‌‌‌లు,  ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌ల కోసం కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 23 ని మార్చాల్సి ఉంది. దీనివల్ల లిస్టింగ్‌‌‌‌ ఈజీ అవుతుంది. అంతేగాక  ఇండియన్‌‌‌‌ కంపెనీలు యుఎస్, యుకె, హెచ్‌‌‌‌కె, చైనా  జపాన్‌‌‌‌లతో సహా విదేశాలలో లిస్టింగ్ చేయడానికి అనుమతించవచ్చని సెబీ కమిటీ 2018 లోనే సూచించింది.