కరోనా ఎఫెక్ట్.. ఓన్ వెహికల్ కే ఇంట్రెస్ట్

కరోనా ఎఫెక్ట్.. ఓన్ వెహికల్ కే ఇంట్రెస్ట్

హైదరాబాద్, వెలుగులాక్ డౌన్ రిలాక్సేషన్స్​లో ప్రైవేట్​ ట్రాన్స్​పోర్ట్​కి గవర్నమెంట్​పర్మిషన్ ఇచ్చినా.. కరోనా ఎఫెక్ట్ తో సిటిజన్స్ వాటిపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆర్టీసీ బస్సులు, మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ స్టార్ట్ కాకపోవడంతో క్యాబ్స్, ఆటోలకు డిమాండ్ ఉంటుందని అంతా అనుకున్నారు. క్యాబ్స్, ఆటోలు, బైక్​ టాక్సీలు సేఫ్టీ ప్రికాషన్స్ తో రోడ్లపైకి వచ్చేశాయి. అయినా, బుకింగ్స్​ మాత్రం అంతగా ఉండడం లేదు. ఎమర్జెన్సీ అయితే తప్ప జనం వాటిని యూజ్ చేయడం లేదు. చాలామంది ఓన్ వెహికల్స్​తోనే బయటికి వస్తున్నారు.  సొంత వెహికల్ లేనివాళ్లు క్యాబ్​లో సింగిల్ బుకింగ్ చేసుకుంటున్నారు. షేరింగ్​ జోలికి మాత్రం వెళ్లడం లేదు.

వైరస్ టెన్షన్

క్యాబ్ సంస్థలు సేఫ్టీ ప్రికాషన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయించినా తెలియని వారితో ట్రావెల్ చేయడం రిస్క్ అనే ఫీలింగ్ సిటిజన్స్​లో ఏర్పడింది. ఆటోలో ఇద్దరు, క్యాబ్​లో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరు జర్నీ చేసే చాన్స్​ ఉన్నా, సింగిల్ బుకింగే బెటర్​ అనుకుంటున్నారు. ఆటోలకు పెద్దగా గిరాకీ ఉండడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. కార్, బైక్​.. ఇలా తమ దగ్గరున్న వెహికల్​నే ఎక్కువగా యూజ్ చేస్తున్నామని.. దగ్గర్లోపనులుంటే నడిచే వెళ్తున్నామని సిటిజన్స్ చెప్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్​పోర్టేషన్ మొదలైనా వాటిల్లోనూ ఇప్పట్లో జర్నీ చేయడం కష్టమేనంటున్నారు.

5 వేలలోపే క్యాబ్స్

2016–-17లో సిటీలో 45వేలకు పైగా క్యాబ్స్ తిరిగేవి.  క్రమంగా వీటి సంఖ్య తగ్గుతూ  వచ్చింది. లాక్ డౌన్​కు ముందు  సిటీలో15వేలకు పైగా నడిచేవి. తక్కువ చార్జీతో ట్రాఫిక్​ ఇబ్బందుల్లేకుండా వెళ్లేలా రెంటల్, బైక్​ ట్యాక్సీలు రావడంతో ఎక్కువమంది వాటినే ప్రిఫర్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం సిటీవ్యాప్తంగా 5 వేల క్యాబ్స్ కూడా తిరగడం లేదు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు కారును శానిటైజ్ చేయడంతోపాటు మాస్క్, గ్లౌస్ వాడుతున్నారు. ప్యాసింజర్స్​కూ మాస్క్ తప్పనిసరి చేశారు. అయినా ఒక్కో క్యాబ్​కి రోజులో 3–5 బుకింగ్స్ మాత్రమే వస్తున్నాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ శివ తెలిపారు. బుకింగ్స్ లొకేషన్ కూడా 5 నుంచి 6 కి.మీ  దూరం ఉంటోందన్నారు. డ్రైవర్ ప్యాసింజర్ దగ్గరకు వెళ్లేందుకు 20–30 నిమిషాలు, తిరిగి లొకేషన్​లో డ్రాప్ చేసేందుకు మరో 30 నిమిషాలు.. ఇలా గంటకుపైగా టైం పడుతోందని తెలిపారు. బుకింగ్ లోకేషన్ దూరంగా ఉండటం వల్ల పికప్, డ్రాపింగ్ ఎక్కువ టైం, డీజిల్ వేస్ట్ అవుతోందని, చార్జీ మాత్రం అంతే ఉంటుందని చెప్పారు.