NTRNeel: ‘ఎన్టీఆర్.. నీల్’ మూవీ అప్డేట్.. ‘బీస్ట్ మోడ్ మళ్ళీ రాజుకోబోతోంది’ అంటూ మేకర్స్ పోస్ట్

NTRNeel: ‘ఎన్టీఆర్.. నీల్’ మూవీ అప్డేట్.. ‘బీస్ట్ మోడ్ మళ్ళీ రాజుకోబోతోంది’ అంటూ మేకర్స్ పోస్ట్

ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో ‘ఎన్టీఆర్.. నీల్’ (NTRNeel) కాంబోపై  భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న హై ఎక్స్‌‌పెక్టేషన్స్‌‌కు ఏమాత్రం తీసిపోకుండా కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా మూవీ తెరకెక్కుతుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ మరియు కోస్తా కర్ణాటకలో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇటీవలే షూటింగ్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్నారు మేకర్స్. ఇందులో భాగంగా మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘‘బీస్ట్ మోడ్ మళ్ళీ రాజుకోబోతోంది. ఎన్టీఆర్.. నీల్ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది’’ అనే క్యాప్షన్‌తో ఫోటో పంచుకున్నారు.

ఈ ఫోటోలో ఎన్టీఆర్ తన కొత్త మేకోవర్ కోసం సెలూన్ కుర్చీలో కూర్చుని ఉన్నారు. అతని స్టైలిస్ట్.. ఎన్టీఆర్ కొత్త లుక్పై నిమగ్నమై ఉండగా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పర్యవేక్షిస్తున్నాడు. అయితే, ఇపుడు ఈ కొత్త లుక్ తోనే ఎన్టీఆర్.. నీల్ మూవీ టీమ్ అంతా ఫారిన్ షెడ్యూల్‌‌‌‌కు రెడీ అవుతున్నారు. నవంబర్ సెకండ్ వీక్లో షూటింగ్ తిరిగి స్టార్ట్ అవ్వనుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ మాస్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎయిర్ పోర్ట్లో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఒకటి బయటకొచ్చింది. ఇందులో గుబురు గడ్డంతో.. నార్మల్ చెక్ షర్ట్ దానిపై బ్లాక్ కోట్ .. బ్లాక్ గాగుల్స్తో కనిపించాడు. ఇక కెమరాను చూస్తూ.. మీసం మెలేస్తూ నడుస్తుంటే.. పులిలా కనిపిస్తున్నాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, గత కొన్ని నెలల నుంచి తారక్ తన లుక్తో బాగా సన్నగా కనపడి ఫ్యాన్స్ని డిజప్పాయింట్ అయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న కొత్త లుక్తో ఫ్యాన్స్ ఊహలకు ఊపిరి పోశాడు. మళ్ళీ తనదైన మాస్ లుక్లో కనిపించి పిచ్చెక్కిస్తున్నాడు ఎన్టీఆర్. 

NTR31 మూవీని ఎన్టీఆర్‌‌‌‌ ఆర్ట్స్‌‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌‌ సంస్థ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాది 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

సినిమా కథ విషయానికి వస్తే.. 

ఇది1960ల కాలంలో జరిగిన కథగా రానుందని సమాచారం. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని నియంత్రించిన చైనీస్ గ్యాంగ్‌స్టర్ జావో వీ జీవితం ఆధారంగా తెరకెక్కునున్నట్లు టాక్ ఉంది. ఇందులో ఎన్టీఆర్ ఒక మాఫియా డాన్ పాత్రలో నటించబోతున్నాడట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సిగ్నేచర్ స్టైల్‌కు అనుగుణంగా, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలతో కూడిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని సమాచారం. మే 20న రానున్న గ్లింప్స్ తో క్లారిటీ వచ్చే అవకాశముంది.