వర్షాకాలంలో ఈవీలు రక్షించుకోండి ఇలా!

వర్షాకాలంలో ఈవీలు రక్షించుకోండి ఇలా!
  • వర్షాకాలంలో ఈవీలు రక్షించుకోండి ఇలా!
  • బ్యాటరీ ఇంపార్టెంట్..వాటర్ చేరకుండా చూసుకోండి
  • వరద ప్రాంతాల్లో నడపకపోవడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఐపీ రేటింగ్ ఎక్కువగా ఉన్న బండ్లు కొనుక్కోవడం మంచిది

న్యూఢిల్లీ : దేశమంతటా భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా కాపాడుకోవాలనే భయం వాహనదారుల్లో కనిపిస్తోంది. భారీ వర్షాలు వచ్చినా మెజార్టీ ఈవీలు బాగానే పనిచేస్తాయి. అందువలన భయపడాల్సిన పనిలేదు. కానీ, బ్యాటరీ క్వాలిటీ బాగోలేని వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందులు తప్పకపోవచ్చు.  అంతేకాకుండా వర్షాకాలంలో బండి ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇచ్చే రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గిపోతుంది. బండిలోకి వాటర్ చేరడం, ఛార్జింగ్ పాయింట్లు లేక ఇబ్బంది పడడం వంటి సమస్యలు వర్షాకాలాల్లో ఎక్కువగా వస్తుంటాయి. 

సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యలను అధిగమించొచ్చు. జాగ్రత్తగా డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రిస్క్ తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటరీ చాలా కీలకమైన పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. బండి మొత్తం ఖర్చులో  బ్యాటరీ కాస్టే ఎక్కువగా ఉంటుంది. ఈవీల్లో  లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారు. వీటిని సీలింగ్ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారు చేస్తారు. అందువలన వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా డస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి అంత ఈజీగా బ్యాటరీలోకి చొచ్చుకుపోవు. అయినప్పటికీ  వర్షాకాలంలో ఎప్పటికప్పుడు బ్యాటరీని చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  బ్యాటరీ కంపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వాటర్ వెళ్లిందా? లేదా? ఏమైనా డ్యామేజ్ జరిగిందా? వంటివి నిర్ధారించుకోవాలి. ఏదైనా డ్యామేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తిస్తే ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సలహా తీసుకోవాలి.

టెంపరేచర్స్ పడిపోతే ఇబ్బందే..

చల్లని, తడి వాతావరణంలో లిథియం బ్యాటరీల కెపాసిటీ, పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గిపోతుంది. టెంపరేచర్స్ తక్కువగా ఉంటే  బ్యాటరీ కెపాసిటీ పడిపోతుందని, ఈవీ ఇచ్చే మైలేజ్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తడి వాతావరణం  లేదా బ్యాటరీలోకి వాటర్ చేరినా ఇవి డ్యామేజ్ అవ్వొచ్చని పేర్కొన్నారు. వీటితో పాటు బ్యాటరీ టెర్మినల్స్  దెబ్బతినడం, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపోనెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షార్ట్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వడం వంటివి వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఇలాంటి రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తగ్గించుకోవడానికి ఎప్పటికప్పుడు బ్యాటరీలను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుండడంతో పాటు, తరచూ మెయింటెనెన్స్ చేయడం ఉత్తమం. టైర్ కండిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చెక్ చేసుకోవాలి. వర్షాకాలంలో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్కిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వాటర్ చేరకుండా ఉండాలంటే వరద ఎక్కువగా ఉన్న ఏరియాల్లో తిరగడం తగ్గించుకోవాలి.

మరిన్నీ జాగ్రత్తలు..

1. వర్షాకాలంలో  వాహనదారులు తమ ఈవీల ఛార్జింగ్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తడిసిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.  అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఛార్జింగ్ స్టేషన్ ఉంటే పూర్తిగా కవర్ చేయండి. పోర్టబుల్ ఛార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటే కొద్దిగా తడిసినా వాడకండి. లేకపోతే ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టొచ్చు.

2. ఎలక్ట్రిక్ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎప్పటికప్పుడు వాష్ చేసుకోండి. వర్షాకాలంలో బండిలోకి చెత్త, దుమ్ము చేరడం ఎక్కువగా జరుగుతుంటుంది. తరచూ క్లీన్ చేయడం ద్వారా బండిలో మట్టి పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా ఎలక్ట్రిక్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బ తినకుండా జాగ్రత్త పడొచ్చు. 

3.  ఎక్కువ నీళ్లు ఉన్న ఏరియాల్లో  డ్రైవ్ చేయకపోవడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈవీల్లో సెన్సిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్స్ ఉంటాయి. వరద ప్రాంతాల్లో ఈవీలను నడిపితే  బ్యాటరీ ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపోనెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈవీలను కొనేముందు ఐపీ రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం ఇవ్వండి. ఐపీ67 రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న బ్యాటరీకి వాటర్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ బ్యాటరీలు కూడా ఎక్కువ కాలం వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోపలికి పోకుండా ఆపలేవు. ప్రస్తుతం అన్ని మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు టఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తట్టుకునేలాఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేస్తున్నాయి. కానీ, కంపెనీలు ఇచ్చే బేసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాలో కావడం ఉత్తమమం.