
సిద్దిపేట : కోహెడ మండలం తీగలకుంట పల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు నేత కాత రాం చంద్రా రెడ్డి(60)అనారోగ్యం తో ఛత్తీస్ గడ్ లో కన్నుమూశారు. కోహెడ మండలం మండలం వరికోలు గ్రామంలో ప్రభుత్వ టీచర్ గా పని చేస్తు1985 లో భార్య శాంతి కుమారి తో కలిసి మావోయిస్టు పార్టీలో చేరేందుకు అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. పదేళ్ల క్రితం భార్య శాంతి కుమారి పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.వీరికి ఒక కుమారుడు,కూతురు ఉన్నారు.