నాయకత్వ లోపంతో మావోయిస్ట్ పార్టీ కూలిపోతుంది: డీజీపీ

నాయకత్వ లోపంతో మావోయిస్ట్ పార్టీ కూలిపోతుంది: డీజీపీ

మావోయిస్ట్ ఆలూరి ఉషారాణి డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయింది. 31ఏళ్లు ఆమె మావోయిస్టుగా పనిచేసినట్లు డీజీపీ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన ఉషారాణి తండ్రి భుజంగరావు 1985 లో పీపుల్స్ వార్లో జాయిన్ అయ్యారని.. 1995లో దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్గా పని చేసినట్లు చెప్పారు. ఆలూరి ఉషారాణి తల్లి, బావ కూడా పీపుల్స్ వార్లో ఉండేవారని.. ఫ్యామిలీ మెంబెర్స్ మావోయిస్టుల్లో ఉండటంతో తను కూడా జాయిన్ అయినట్లు తెలిపారు.

1991లో మునుగోడు దళం మెంబర్గా ఎన్నికైందని డీజీపీ తెలిపారు. 1998 యాదగిరిగుట్ట పీఎస్పై దాడి చేసి ఆయుధాలు తీసుకెళ్తున్న టైమ్ లో జరిగిన ఎన్కౌంటర్లో తన భర్త చనిపోయాడని చెప్పారు. 2002 నుంచి ఇప్పటివరకు దండకారణ్య జోనల్ కమిటీలో పని చేసిందని..2011 లో ప్రాపగాండా ఆర్గనైజ్ చేయడానికి పొలిటికల్ టీచర్ ఇన్ మొబైల్ స్కూల్కి ఇంచార్జ్గా పని చేసినట్లు చెప్పారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019లో మావోయిస్టు పార్టీని వీడి పోలీసులకు సరెండర్ అవుతానని పార్టీని కోరిందని..రెండున్నరేళ్ల తర్వాత లొంగిపోయిందని వివరించారు.

జంపన్న, సుధాకర్ సరెండర్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేది మహేందర్ రెడ్డి తెలిపారు. కొత్తగా రిక్రూట్ అయినవారికీ ఐడియాలజీ లేదని.. నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కూలిపోతుందని చెప్పారు. ముగ్గురు సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఆరోగ్యం బాగలేక చనిపోయారని.. మరో ఆరుగురు సెంట్రల్ కమిటీ మెంబర్స్ లొంగిపోయారన్నారు. 11మంది అగ్రనాయకులకు ఆరోగ్యం బాగాలేదని.. వారంతా లొంగిపోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.