
న్యూఢిల్లీ: పిల్లల్ని తమ దళాల్లో చేర్చుకోవడానికి మావోయిస్టులు పెద్ద ఎత్తున్న యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లల్ని రిక్రూట్ చేసుకోవడమే గాక వారికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని సమాచారం. మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో పిల్లలకు నక్సలైట్లు మిలిటెంట్ శిక్షణ ఇస్తున్నారని లోక్‌సభలో స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ (ఎంవోహెచ్) తెలిపింది. ఈ మేరకు తమ దగ్గర పలు రిపోర్టులు ఉన్నాయని ఎంవోహెచ్ పేర్కొంది. పిల్లల్ని రిక్రూట్ చేసుకొని.. వారితో వంట పని, రోజు వారీగా వాడే పరికరాలను తెప్పించుకోవడం లాంటివి చేస్తున్నట్లు ఎంవోహెచ్ స్పష్టం చేసింది. పిల్లలతో భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకుంటున్నట్లు ఎంవోహెచ్ తెలిపింది.