
ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా దొరికిపోయిన రాకేశ్వర్ సింగ్‌ను మావోలు విడుదల చేశారు. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్థుల ద్వారా కోబ్రా కమాండెంట్ జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను విడిచిపెట్టారు. రాకేశ్వర్ సింగ్‌ను బందీగా ఉంచుకొని.. మధ్యవర్తుల పేర్లు చెప్పాలని మావోలు ఛత్తీస్‌గడ్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను విడుదలచేశారు. ఈ నెల 3న భద్రతాదళాలు, మావోలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు, నలుగురు మావోలు కన్నుమూశారు.