భద్రతా బలగాల దాడి ఫొటోలు రిలీజ్ చేసిన మావోయిస్టులు

భద్రతా బలగాల దాడి ఫొటోలు రిలీజ్ చేసిన మావోయిస్టులు

ఛత్తీస్ఘడ్ బస్తర్ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాల దాడికి సంబంధించిన ఫొటోలను మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. తమపై డ్రోన్లతో దాడులు చేశారని ఆరోపిస్తూ ఫొటోలు రిలీజ్ చేసింది. ఈ నెల 11ను బ్లాక్ డేగా అభివర్ణించింది. భద్రతా బలగాల దాడిలో కామ్రేడ్ పొట్టం హుంగి మరణించినట్లు మావోయిస్ట్ పార్టీ ధృవీకరించింది. భద్రతా బలగాల దాడిలో ఆరుగురు మావోయిస్టు కమాండోలు గాయపడ్డారని చెప్పింది. బెటాలియన్ కమాండో హిడ్మా ప్రాణాలతోనే ఉన్నారని.. కేంద్ర ప్రభుత్వం హిడ్మా మరణించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. 

సర్జికల్ స్ట్రైక్ పేరుతో వేలాది బాంబులను తమపై వేశారని.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎయిర్ ఫోర్స్ బలగాలు  విచక్షణ రహితంగా దాడి చేశాయని మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. బస్తర్ ప్రాంతంలో ఇప్పటి వరకు మూడు సార్లు బాంబుల వర్షం కురిసిందని తెలిపింది. ఖనిజ సంపద కొల్లగొట్టడానికే బలగాలతో దాడులకు దిగుతున్నారని ఆరోపించింది. పోలీసుశాఖలో పేద, మధ్యతరగతి యువకులు చేరవద్దని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది.