విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

విశాఖపట్టణం: విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ దళాలే టార్గెట్ గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈఘటనలో 160 బీఎస్ ఎఫ్  బెటాలియన్ కు చెందిన ధర్మేంద్ర సాహు  తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సహచరులు హుటాహుటిన హెలికాప్టర్ లో చికిత్స నిమిత్తం రాయపూర్ తరలించారు. ఏవోబీ లో గల మల్కన్ గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాల్ దాలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందుకున్న  బీఎస్ ఎఫ్ జవాన్లు  ఆ ప్రాంతానికి కుంబింగ్ చేసుకుంటూ వెళ్లారు. బీఎస్ఎఫ్ జవాన్ల రాకను పసిగట్టిన మావోయిస్టులు లాండ్ మైన్ పేల్చారు. వెంటనే తేరుకున్న జవాన్లు మావోయిస్టుల పై ఎదురు కాల్పులు జరిపారు. సమావేశమైన మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ తప్పిచుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చడంతో బీఎస్ ఎఫ్ 160 బెటాలియన్ కు చెందిన ధర్మేంద్ర సాహు అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. తమను తాము ఆత్మరక్షణ చేసుకుంటూ మావోయిస్టులను పట్టుకునేందుకు ఓ వైపు జవాన్లు కాల్పులు జరుపుతూనే గాయపడిన తమ సహచరుడికి వైద్య చికిత్స నిమిత్తం వెనక్కి పంపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే హెలికాప్టర్ ను పంపించి రాయపూర్ కు తరలించారు. తప్పిచుకున్న మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. జవాన్లలో ఆత్మస్థయిర్యం నిపేలా అదనపు బలగాలను దింపి ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఒకవైపు స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో కూంబింగ్.. ల్యాండ్ మైన్ పేలుడు ఘటన విశాఖ ఏజెన్సీ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

For More News..

కార్పొరేట్  కాలేజీలు మూసేసేదాకా పోరాడదాం

తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదు

శ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు