Marco sequel: హీరోగా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేశాడు.. ఉన్నట్టుండి సీక్వెల్ వదులుకున్నాడు.. కారణం ఇదే!

Marco sequel: హీరోగా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేశాడు.. ఉన్నట్టుండి సీక్వెల్ వదులుకున్నాడు.. కారణం ఇదే!

ఉన్ని ముకుందన్‌‌‌‌‌‌‌‌ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన యాక్షన్‌‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘మార్కో’ వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌తో బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈ చిత్రంలోని  మితిమీరిన హింస, రక్తపాతం కారణంగా అదే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ సినిమా సక్సెస్‌‌‌‌‌‌‌‌ కనుక దీనికి సీక్వెల్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కించబోతున్నారు మేకర్స్‌‌‌‌‌‌‌‌. ‘లార్డ్‌‌‌‌‌‌‌‌ మార్కో’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించారు.

హనీఫ్‌‌‌‌‌‌‌‌ అదేని ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనుండగా షరీఫ్‌‌‌‌‌‌‌‌ మహమ్మద్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నారు. అయితే ఉన్ని ముకుందన్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఇందులో హీరోగా నటించడం లేదు. సీక్వెల్‌‌‌‌‌‌‌‌లో ఆయన నటించడం లేదని మేకర్స్‌‌‌‌‌‌‌‌ క్లారిటీ ఇచ్చారు.  ఉన్ని ముకుందన్ కూడా మూడు నెలల క్రితమే సీక్వెల్‌‌‌‌‌‌‌‌లో నటించే ఆసక్తి లేదని స్పష్టం చేశాడు.

సోషల్ మీడియాలో ఓ అభిమాని ప్రశ్నకు బదులిస్తూ.. ‘మార్కో’ సిరీస్‌‌‌‌‌‌‌‌పై టూ మచ్ నెగిటివిటీ ఉందని, అందుకే దానికంటే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు. ఇక తను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఆ పాత్రను ఎవరు పోషిస్తారా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. కన్నడ స్టార్ యశ్‌‌‌‌‌‌‌‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే మోహన్‌‌‌‌‌‌‌‌ లాల్, పృథ్విరాజ్‌‌‌‌‌‌‌‌ సుకుమారన్‌‌‌‌‌‌‌‌ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.