4 కొత్త ఫ్లేవర్లలో సఫోలా మసాలా ఓట్స్

4 కొత్త ఫ్లేవర్లలో సఫోలా మసాలా ఓట్స్

హైదరాబాద్​, వెలుగు: మారికో ఫ్లాగ్​షిప్ బ్రాండ్-సఫోలా నాలుగు కొత్త ఫ్లేవర్లతో ఓట్స్​ను తీసుకొచ్చింది. వీటిలో నట్టి చాక్లెట్,యాపిల్ 'ఎన్' ఆల్మండ్స్, స్పైసీ మెక్సికానా, చీజీ ఇటాలియాల రుచులు ఉంటాయి. అల్పాహారానికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయని కంపెనీ తెలిపింది.  వీటిని చాలా తక్కువ సమయంలో వండవచ్చని పేర్కొంది. సఫోలా మసాలా ఓట్స్ మొత్తం ఆరు ఫ్లేవర్లలో దొరుకుతాయని తెలిపింది.