
ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాల్లోనే నటించిన విశాల్.. ఈసారి ‘మార్క్ ఆంటోని’ అనే డిఫరెంట్ జానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రానా, తమిళ వెర్షన్ ట్రైలర్‌ను కార్తి విడుదల చేసి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్స్ చేతికి టైమ్ మిషన్ చిక్కితే ఏమవుతుంది అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. భవిష్యత్తు నుంచి తండ్రి ఆంటోనిని వెతుక్కుంటూ గతంలోకి వస్తాడు మార్క్. ఈ రెండు క్యారెక్టర్స్‌ను విశాల్ పోషించాడు. గ్యాంగ్‌స్టర్స్ పాత్రల్లో విశాల్, ఎస్.జె.సూర్య రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో యంగ్‌గా, ఏజ్డ్‌గా కనిపించారు.
మొదట్లో ఫ్రెండ్స్ అయిన వీళ్ల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి, టైమ్ మిషన్ ద్వారా వీళ్లు ఏం చేశారనేది ఆసక్తి రేపుతోంది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది.