రిజల్ట్స్ పై మార్కెట్‌‌‌‌ ఫోకస్... గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం సెలవు

రిజల్ట్స్ పై మార్కెట్‌‌‌‌ ఫోకస్... గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం సెలవు

న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ను కంపెనీల రిజల్ట్స్‌‌‌‌, గ్లోబల్ అంశాలు, మాక్రో ఎకనామిక్ డేటా వంటివి నిర్ణయిస్తాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.  గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం  మార్కెట్‌‌‌‌కు సెలవు. ఈ వారం హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ ఇండియా  మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ పీఎంఐ, సర్వీసెస్‌‌‌‌  పీఎంఐ, కాంపోజిట్ పీఎంఐ వంటి డేటా విడుదల కానున్నాయి. 

భారతి ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, టైటాన్‌‌‌‌, అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ, హిందాల్కో, బజాజ్‌‌‌‌ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా  వంటి కంపెనీల క్వార్టర్లీ   ఫలితాలు  విడుదల కానున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే,  ట్రేడ్ డీల్స్, విదేశీ మార్కెట్ల ట్రెండ్‌‌‌‌లు, రూపాయి- డాలర్ మార్పిడి వంటి అంశాలు మార్కెట్ డైరెక్షన్‌‌‌‌పై ప్రభావం చూపొచ్చు.  

కాగా, ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు  కిందటి నెలలో నికరంగా రూ.14,610 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.  గత వారం బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌ 273 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్లు తగ్గాయి.