బిట్‌‌‌‌కాయిన్ వాల్యూ 10 వేల డాలర్లకు పడిపోతుంది : మార్క్ మొబియస్

బిట్‌‌‌‌కాయిన్ వాల్యూ 10 వేల డాలర్లకు పడిపోతుంది : మార్క్ మొబియస్

న్యూఢిల్లీ: పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్‌‌‌‌కాయిన్ వాల్యూ 10 వేల డాలర్లకు పడిపోతుందని  సీనియర్ ఫండ్ మేనేజర్ మార్క్ మొబియస్ అంచనావేశారు.  తన సొంత డబ్బులు కాని, క్లయింట్ల డబ్బులు కాని డిజిటల్ కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయనని ఆయన పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీలు చాలా డేంజర్‌‌‌‌‌‌‌‌ అని వ్యాఖ్యానించారు. ‘ చాలా మంది ఇన్వెస్టర్లకు క్రిప్టోలపై  ఇంకా నమ్మకం ఉంది. అందుకే ఎఫ్‌‌‌‌టీఎక్స్ సంక్షోభం నెలకొన్నా  బిట్‌‌‌‌కాయిన్ నిలబడగలుగుతోంది’ అని అన్నారు. శామ్‌‌‌‌ బ్యాంకమన్‌‌‌‌కు చెందిన  క్రిప్టో ఎక్స్చేంజి ఎఫ్‌‌‌‌టీఎక్స్‌‌‌‌, సబ్సిడరీ అలమెడా రీసెర్చ్‌‌‌‌లు దివాలా తీయడంతో క్రిప్టో కరెన్సీలు భారీగా పడుతున్న విషయం తెలిసిందే.  

కొంత మంది ఎనలిస్టులు బిట్‌‌‌‌కాయిన్  2020 ప్రారంభంలోని ధరకు పడిపోతుందని అంచనావేస్తున్నారు. కాగా, బిట్‌‌‌‌కాయిన్ సోమవారం 2 శాతం నష్టపోయి  16 వేల డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. 2020 స్టార్టింగ్‌‌‌‌లో 5 వేల డాలర్ల దగ్గర ట్రేడయిన బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌, కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో 69 వేల డాలర్ల దగ్గర ఆల్‌‌‌‌టైమ్ గరిష్టాన్ని రికార్డ్ చేసింది.  డెరిబిట్‌‌‌‌ విడుదల చేసిన ఆప్షన్స్ డేటా ప్రకారం, డిసెంబర్ ఎక్స్‌‌‌‌పైరీకి సంబంధించి  బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌కు 10,000 డాలర్ల దగ్గర ఎక్కువ పుట్ కాంట్రాక్ట్స్‌‌‌‌ ఉన్నాయి. అంటే ఈ లెవెల్‌‌‌‌  కంటే కిందకు పడుతుందని ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అంచనావేస్తున్నారని అర్థం.