మున్సిపాలిటీ వైస్​ చైర్మన్​గా వెంకన్న

మున్సిపాలిటీ వైస్​ చైర్మన్​గా వెంకన్న

మహబూబాబాద్ అర్బన్, వెలుగు :  మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా మార్నేని వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో అలివేలు తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ ఆర్డీవో అధ్యక్షతన జరిగిన వైస్​ చైర్మన్​ ఎన్నికలో  కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి వైస్ చైర్మన్ పదవికి వెంకన్న పేరు ప్రతిపాదించగా, కౌన్సిలర్​ఎస్.సోమయ్య బలపర్చారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో వైస్​చైర్మన్​గా వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి, ధ్రువీకరణ పత్రం అందజేశారు. బీఆర్ఎస్  20 మంది కౌన్సిర్లు, కాంగ్రెస్ 10 మంది కౌన్సిలర్లు, ఇద్దరు సీపీఎం, ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ పాల్గొన్నారు. వీరితోపాటు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.