
హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. శామీర్ పేటలోని ఓ రిసార్ట్ లో ఈ ఉదయం 6-31 నిమిషాలకు ప్రియురాలు డాక్టర్ పల్లవి వర్మను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు నిఖిల్. కొద్దిమంది బంధువుల సమక్షంలోనే పెళ్లి జరిగిందన్నాడు. మొదటగా నిఖిల్ ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ లాక్ డౌన్ కారణంగా మే 14(ఇవాళ) ఇరు కుటుంబ సభ్యులు ముహూర్తం పెట్టుకున్నారు.
మళ్లీ లాక్ డౌన్ మే 17వరకు ప్రకటించడంతో మరోసారి వాయిదా వేసుకోవాలనుకున్నారు. కానీ దిల్ రాజ్ రెండో పెళ్లి చేసుకోవడంతో .. మనసు మార్చుకున్న నిఖిల్ కూడా మే 14న పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే గురువారం నిఖిల్, పల్లవి వర్మ ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో నిఖిల్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read more News