ఇవాళ భూమికి దగ్గరగా కుజుడు

ఇవాళ భూమికి దగ్గరగా కుజుడు
  • 14న ఒకే ఆర్బిట్ లోకి సూర్యుడు, భూమి, అంగారకుడు

హైదరాబాద్, వెలుగు: ఆకాశంలో మంగళవారం అరుదైన సీన్ కనిపించనుంది. అంగారక గ్రహం మామూలు కంటే మరింత ఎక్కువగా మెరుస్తూ కనిపించనుంది. ఇవ్వాళ కుజుడు మన భూమికి 6 కోట్ల 20 లక్షల కిలోమీటర్ల దగ్గర్లోకి రానున్నాడు. మామూలు టైంలోనూ ఈ గ్రహం మనకు ఆకాశంలో ఎర్రగా మెరుస్తూ కన్పిస్తుంది. ఇప్పుడు దగ్గరగా వస్తుండటంతో బాగా కన్పించనుంది. టెలిస్కోప్ తో మరింత బాగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ ఎన్​.రఘునందన్​ కుమార్​వెల్లడించారు. ప్రతి 26 నెలలకు ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని  అంగారక ప్రయాణ కోసం నాసా, ఇస్రోలాంటి అంతరిక్ష సంస్థలు ఉపయోగించుకుంటూ ఉంటాయని తెలిపారు. భూమి, మార్స్ మళ్లీ 15 ఏళ్ల తర్వాతే ఇంత దగ్గరగా వస్తాయని నాసా చెప్పింది. ఈ నెల 14న సూర్యుడు, భూమి, అంగారక గ్రహాలు ఒకే ఆర్బిట్ లోకి వస్తాయని తెలిపింది.