ఆలేరులో అమరవీరుల స్థూపం ఆవిష్కరణ

ఆలేరులో అమరవీరుల స్థూపం ఆవిష్కరణ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ కోదండరాం, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీ కృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేశ్ రెడ్డి, గద్దర్  కూతురు వెన్నెల ఆవిష్కరించారు. 

ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్  పార్టీ నేతలు, గ్రామస్తులు, యువకులు హాజరై అమరవీరులను స్మరించుకున్నారు. వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పాటైందని పేర్కొన్నారు.