మారుతీ కార్ల ధరలు పెరుగుతున్నయ్

మారుతీ కార్ల ధరలు పెరుగుతున్నయ్

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ వచ్చే నెల నుంచి కొన్ని మోడల్స్ ధరలను పెంచుతోంది. మెటీరియల్స్, లేబర్ వంటి ఇన్‌‌పుట్ కాస్టులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో తెలిపింది. అయితే ఏయే మోడళ్లపై ఎంతెంత పెంచుతారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఈ ఏడాది జనవరిలో కంపెనీ కొన్ని మోడల్స్ పై రూ.34 వేల వరకు రేట్లు పెంచింది. ఇదే ఏడాది ఏప్రిల్ 16 న కూడా  కొన్ని మోడల్స్ ధరలను పెంచింది. సగటు పెరుగుదల 1.6 శాతం ఉంటుందని ప్రకటించింది.   మారుతి సుజుకీ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌‌బ్యాక్ ఆల్టో నుండి ఎస్-క్రాస్ వరకు  వివిధ మోడళ్లను అమ్ముతోంది. వీటి ఎక్స్‌‌షోరూమ్‌‌ ధరలు రూ .2.99 లక్షల నుండి రూ .12.39 లక్షలు.