
రావు రమేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఇటీవల ఫస్ట్ లుక్‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్, శుక్రవారం టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘మారుతీ నగర్ లో ఫేమస్ అంటే నేనేలే... అందరూ ఇదే మాట అంటారులే, మహారాజా యోగమే ఆన్ ద వేలో ఉందిలే... నన్ను పట్టుకోవడానికే వస్తుందిలే, నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం, నాకు నేనే ఇష్టం... మీకేంటంట కష్టం’ అంటూ భాస్కరభట్ల రాసిన ఈ పాటను కళ్యాణ్ నాయక్ కంపోజ్ చేయగా రామ్ మిరియాల పాడాడు. ‘నేటివిటీతో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. కామెడీతో పాటు మంచి కథ, భావోద్వేగాలు ఉన్నాయి. ఇప్పటివరకూ పోషించని భిన్నమైన పాత్రలో రావు రమేష్ కనిపిస్తారు’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు.