కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకీ

కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకీ

మారుతి సుజుకీ కార్ల ధరలు అమాంతం పెంచేసింది. ధరల్లో సగటు పెరుగుదల 0.45 శాతంగా పేర్కొంది. మారుతి సుజుకీ అన్ని మోడళ్ల అంచనా ధర పెరుగుదల గత ఎక్స్ షోరూమ్ ధరల ప్రకారం పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు జనవరి 16 నుంచి అమల్లో ఉంటాయని కంపెనీ ఎక్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. 

మారుతి సుజుకీ గతేడాది (2023)  ఏప్రిల్ లో కూడా తన ప్రాడక్ట్స్ ధరలు పెంచింది. ఆల్టో నుంచి ఇన్విక్టో వరకు కార్లను తయారు చేసి విక్రయిస్తు్న్న మారుతి సుజుకీ.. వాటి ధరను రూ. 3.54 లక్షల నుంచి రూ. 28.42 లక్షల ధరలకు ప్రస్తుతం అమ్ముతోంది. 

మారుతి సుజుకీ అమ్మకాలు 

2023 డిసెంబర్ లో మారుతి సుజుకీ మొత్తం లక్షా 37వేల 551 కార్లను విక్రయించింది. అయితే 2022 డిసెంబర్ లో లక్షా 39 వేల 347 కార్లను విక్రయించింది. అంటే దాదాపు 1.28 శాతం క్షీణతను నమోదు చేసింది. గత డిసెంబర్ లో కంపెనీ మొత్తం అమ్మకాలలో లక్షా 06వేల 492 కార్లు ఇండియాలో అమ్ముడు పోగా, OEMలు 4వేల 175 కాగా.. ఎక్స్ పోర్ట్స్ 26వేల 884 కార్లను ఎక్స్ పోర్ట్స్ చేసింది. మారుతి ఓ రికార్డును కూడా సాధించింది. 2023 సంవత్సరంలో మొత్తం 2 మిలియన్ల కార్లను అమ్మింది. 2023లో అత్యధికంగా 2లక్షల69వేల 046 కార్లు ఉన్నాయి.