రూ.4 లక్షలకే మారుతిలో మినీ SUV మోడల్

రూ.4 లక్షలకే మారుతిలో మినీ SUV మోడల్

దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి సరికొత్త కారును ఇవాళ (సోమవారం) లాంచ్ చేసింది. మినీ SUVని తలపించేలా… S-ప్రెస్సో పేరుతో ఇండియాలో లాంచ్ అయింది. ఢిల్లీలోని దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ .3.69 లక్షలు, హై వెర్షన్ ధర రూ .4.91 లక్షలుగా నిర్ణయించారు.

ఈ కారును పూర్తిగా దేశీయ టెక్నాలజీతో భారతీయ అవసరాలకు తగిన విధంగా… మారుతి ఎస్-ప్రెస్సో స్టాండర్డ్, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, విఎక్స్ఐ + తో సహా నాలుగు వేరియంట్ స్థాయిలలో లభించనుంది. పెట్రోల్ ఇంజన్ వెర్షన్ మాత్రమే మార్కెట్లో లాంచ్ చేశారు సంస్థ నిర్వాహకులు. కారులో 10 కి పైగా భద్రతా లక్షణాలు కల్పించారు.

ప్రత్యేకతలు:

మారుతి ఎస్-ప్రీసో యొక్క ఫ్రంట్ లుక్ చాలా బోల్డ్ గా ఉంది. ఇది అధిక బానెట్ లైన్, క్రోమ్ గ్రిల్, పెద్ద హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు హెడ్‌లైట్ కింద ఉన్నాయి. ముందు, వెనుక బంపర్లు చాలా భారీగా ఉంటాయి, ఎస్-ప్రీసో బోల్డ్ గా కనిపిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ. దీనిలోని బీఎస్6  ఇంజిన్ కు 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను  అమర్చారు. ప్రతి వేరియంట్ లో డ్రైవర్ వైపు ఎయిర్ బ్యాగ్ ఖచ్చితంగా ఉంటుంది.

ఈ చిన్న కారు 6 రంగులలో లభించనుంది. ఎస్-ప్రీసో మారుతి సుజుకి యొక్క హియర్టెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. కారు కూడా తేలికగా ఉంటుంది. మారుతి… ఈ కారును దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆసియాన్ దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.