ఎక్సర్​సైజ్​ చేసేటప్పుడు మాస్క్​ డేంజరే​

ఎక్సర్​సైజ్​ చేసేటప్పుడు మాస్క్​ డేంజరే​

బిల్​ కెరోల్​, ఇండియానా యూనివర్సిటీ ప్రొఫెసర్​, బ్లూమింగ్​టన్
కార్బన్​ డయాక్సైడ్​ పేరుకుని లంగ్స్‌ కుంచించుకుపోతయి
గుండె వేగం పెరుగతది.. చెవులు వినపడవు
కంటి చూపు మందగిస్తది.. మెదడుపై ప్రభావం
వర్కవుట్ల టైంలో మాస్క్​ వాడొద్దంటున్న నిపుణులు

వెలుగు సెంట్రల్​డెస్క్​: మాస్క్​.. రెండు నెలల క్రితం వరకు దానికి అంత ఇంపార్టెన్స్​ లేదు. కానీ, ఇప్పుడు అదే మనకు కొండంత రక్ష. ప్రతి ఒక్కరూ మాస్క్​ లేనిదే బయటకు వెళ్లట్లేదు. అంతలా మార్చేసింది కరోనా. మాస్క్​ అంటే ఏంటో తెలియని వాళ్లకూ దానిని దగ్గర చేసింది. పల్లెపల్లెకు.. గడపగడపకు అది చేరిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫోన్​ పెట్టుకున్నమా.. బండి తాళం తీసుకున్నమా.. పర్సు ఉందా.. అని మాత్రమే చెక్​ చేసుకుంటం. ఇప్పుడు, ‘మాస్క్​ తగిలించుకున్నమా’ అన్నదీ చూసుకుంటున్నం. అంతలా మన జీవితాలకు బలంగా అల్లుకుపోయింది. ఇప్పుడున్న టైంలో అది మంచిదే. కానీ, అన్ని వేళల్లో మాస్క్​ పెట్టుకోవడమూ అంత మంచిది కాదన్నది నిపుణుల మాట.

కార్బన్​ డయాక్సైడ్​ పేరుకుంటది

బాగా జనం ఉన్న ప్లేస్​లకు వెళ్లినప్పుడు ఓకేగానీ, పొద్దున ఎక్సర్​సైజులు చేసేటప్పుడు, జాగింగ్​, వాకింగ్​కు వెళ్లేటప్పుడూ చాలా మంది మాస్కులు పెట్టుకుంటున్నారు. అది చాలా డేంజర్​ అని నిపుణులు చెబుతున్నారు. ఎక్సర్​సైజులు చేసేటప్పుడు శ్వాస ఇంకెక్కువ తీసుకుంటాం. ఆక్సిజన్​ అవసరం మరింత ఎక్కువవుతుంది. ఆ టైంలో నోటికి మాస్కు అడ్డుగా ఉంటే లంగ్స్​కు సరిపడా  గాలి అందదు. ఊపిరాడదు. ఫలితంగా బయటకు వెళ్లిపోవాల్సిన కార్బన్​ డయాక్సైడ్​ ఊపిరితిత్తుల్లో పేరుకుపోతుంది. రక్తం, మెదడులో ఆక్సిజన్​ స్థాయిలు తగ్గిపోతాయి. దాన్నే ‘హైపర్​కాప్నియా’ అని పిలుస్తారు. సింపుల్​గా చెప్పాలంటే చెడుగాలి పీల్చడం. దాని వల్ల ఊపిరితిత్తులపై భారం పడి కుచించుకుపోతాయి. అన్ని అవయవాలకు ఆక్సిజన్​ సరఫరా అందదు. కళ్లుతిరిగి కుప్పుకూలిపోతారు. ఒక్కోసారి కోమాలోకి కూడా జారుకునే ముప్పు ఉంటుంది. గుండె కొట్టుకునే వేగంలోనూ మార్పులు వస్తాయి. కార్బన్​ డయాక్సైడ్​ మోతాదు ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తం పీహెచ్​ను కార్బన్​డయాక్సైడ్​ కంట్రోల్​ చేస్తుందని, అది ఎక్కువైతే రక్తంలోయాసిడ్​ గుణాన్ని, తక్కువైతే క్షార గుణాన్ని ఇస్తుందని అంటున్నారు. చనిపోయే ముప్పూ ఎక్కువే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎన్​95 మాస్కుల విషయంలో ఈ హైపర్​కాప్నియా ముప్పు ఎక్కువని,  మామూలు క్లాత్​ మాస్కులతో అంత డేంజర్​ ఉండదని చెబుతున్నారు.

కొన్ని సంఘటనలు..

మాస్క్​ పెట్టుకుని ఎక్సర్​సైజు చేయడం వల్ల కొంతమంది అనారోగ్యానికి గురైన సంఘటనలూ ఉన్నాయి. ఓ రెండు వారాల కిందట చైనాకు చెందిన ఝాంగ్​ పింగ్​ అనే 26 ఏళ్ల యువకుడు మాస్క్​ పెట్టుకుని దాదాపు రెండు గంటలపాటు 4 కిలోమీటర్లు జాగింగ్​ చేశాడు. ఉన్నట్టుండి కిందపడిపోయాడు. తోటి జాగర్స్​ వెంటనే ఆస్పత్రిలో చేర్పించడంతో డాక్టర్లు టెస్ట్​ చేసి.. ఊపిరితిత్తులు 90 శాతం కుంచించుకుపోయాయని, పంక్చర్​ అయ్యాయని గుర్తించారు. గుండె కూడా కొద్దిగా డ్యామేజ్​ అయినట్టు తేల్చారు. ఆక్సిజన్​ సరైన మోతాదులో అందకపోవడం, కార్బన్​ డయాక్సైడ్​ పేరుకుపోవడం వల్లే అలా జరిగిందని నిర్ధారించారు. మరో ఘటనలో అదే చైనాలో హెనాన్స్​ ప్రావిన్స్​కు చెందిన ఇద్దరు 14 ఏళ్ల పిల్లలు చనిపోయారు. మాస్క్​లు పెట్టుకుని జిమ్​లో వర్కవుట్స్​ చేయడం వల్ల ఆక్సిజన్​ అందక చనిపోయారు.  అమెరికాలోనూ అలాంటిదే ఇంకో ఘటన జరిగింది. న్యూజెర్సీలోని లింకన్​ పార్క్​ వద్ద మాస్క్​ పెట్టుకుని కారులో వెళ్తున్న ఓ వ్యక్తి సడన్​గా ఓ స్తంభానికి ఢీకొట్టాడు. పోలీసుల విచారణలో మాస్కు పెట్టుకోవడం వల్లే అలా జరిగిందని చెప్పాడు. ఎన్​95 మాస్క్​ పెట్టుకుని కార్​ను డ్రైవ్​ చేస్తున్నానని, ఆక్సిజన్​ అందక మైకం కమ్మేసిందని, దీంతో కారు అదుపు తప్పి పోల్​ను ఢీకొట్టిందని అన్నాడు. ఇవే కాదు.. ఇలాంటి ఘటనలే చాలా చోట్ల జరిగాయి.

మామూలుగా వాతావరణంలో 0.04 % కార్బన్​ డయాక్సైడ్​ ఉంటుంది. అది 10 శాతానికి చేరితేనే ప్రమాదం. అలాగని తక్కువున్నా ప్రమాదమే. రక్తంలోని పీహెచ్​ స్థాయిలను కార్బన్​ డయాక్సైడ్​ నియంత్రిస్తుంది. దాన్ని బ్యాలెన్స్​డ్​గా ఉంచుకోవాలి. లేదంటే ఊపిరితిత్తులకు ముప్పు తప్పదు. చనిపోయే ప్రమాదమూ ఉంటుంది.

ఇంట్లో ఉన్నా.. డ్రైవింగ్చేసినా వాడొద్దు

డాక్టర్లు, హెల్త్​ నిపుణులు మాస్క్​ పెట్టుకోవాలని సూచిస్తున్నా.. అన్ని సందర్భాల్లోనూ అవసరం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్సర్​సైజులు చేసేటప్పుడు వాడొద్దంటున్నారు. కార్లలో ప్రయాణించేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్​ అవసరం లేదని చెబుతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు మాస్కుకు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు. ఎక్కువ మంది ఉండే ప్రదేశాల్లోనే మాస్క్​ పెట్టుకోవాలంటున్నారు.

హైపర్కాప్నియా లక్షణాలివీ

కంటి చూపు మందగిస్తుంది
చెవులు వినపడవు
మెదడుపై ప్రభావం: నీరసం, మత్తు, కళ్లు తిరగడం, తల తిరగడం, కన్ఫ్యూజన్​, తలనొప్పి, స్పృహ తప్పడం.
చెమట ఎక్కువ వస్తుంది
ఊపిరి ఆడదు
గుండె ఎక్కువ కొట్టుకుంటది
బీపీ పెరుగుతది
కండరాలు పీకేసినట్టు అవుతాయి

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్