పైసలిస్తే చిట్టీలు పెట్టి రాయొచ్చు

పైసలిస్తే చిట్టీలు పెట్టి రాయొచ్చు

ఇంటర్ ఎగ్జామ్స్ లో డబ్బులు తీసుకుని చిట్టీలు పెట్టి కాపీ కొట్టేందుకు అవకాశం ఇస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ నం. 60352..కేఎంఆర్ జూనియర్ కాలేజీ సొసైటీ మెంబర్ మహేందర్ రెడ్డిపై జిల్లా ఇంటర్ బోర్డు హై పవర్ కమిటీ మెంబర్లు క్రిమినల్ కేసు పెట్టారని డీఐఈవో జయప్రదబాయి తెలిపారు. శనివారం ఈ కాలేజీలోని ఎగ్జామ్ సెంటర్ లో డిస్ట్రిక్ హై పవర్ కమిటీ మెంబర్లు తనిఖీలు నిర్వహించారు. రూం నెం. 404లో ఫిజిక్స్ పేపర్‍–1 రాస్తున్న ఓ స్టూడెంట్, ఎకనామిక్స్ పేపర్–1 రాస్తున్న నలుగురు స్టూడెంట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిపై మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు చేశారు.

కాలేజీలో ప్రత్యేక తనిఖీలు
కేఎంఆర్‍ జూనియర్ కాలేజీ చైర్మన్ మహేందర్‍ రెడ్డి స్టూడెంట్స్ తల్లిదండ్రులతో పైసలు ఇస్తే చిట్టీలు పెట్టి పరీక్షలు రాసే విధంగా వాట్సాప్ లో ఒప్పందం కుదుర్చు కోవడం హల్‍ చల్ సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇంటర్మీడియట్‍ ఎగ్జామినేషన్ అధికారులు కాలేజీలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టీలు పెట్టి పరీక్షలు రాస్తున్న పలువురు స్టూడెంట్స్ ని పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించిన కేఎంఆర్‍ సోసైటీ మెంబర్ మహేందర్‍ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హై పవర్‍ కమిటీ ఎస్‍ఆర్‍ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కాలేజీ నిర్వాహకులపై క్రిమినల్‍ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.మరోవైపు జిల్లా పరిధిలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజస్ పేపర్–1 ఎగ్జామ్స్ కి మొత్తం 89,302 స్టూడెంట్స్ కి గాను 85,294 మంది అటెండ్ అయ్యారు. 4,008మంది స్టూడెంట్స్ గైర్హా జరైనట్టు డీఐఈవో అధికారులు తెలిపారు.

జిల్లా పరిధిలో 5 మాల్ ప్రాక్టిస్ కేసులు, ఎస్ ఆర్ నగర్ లోని సెంటర్ కోడ్.60334, అమోగ జూనియర్ కాలేజీలో హాల్ టికెట్ నం.1960321332 క్యాండి డేట్ కి బదులు మరోవ్యక్తి ఎగ్జామ్ రాస్తుండగా.. అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు గుర్తించి ఇమ్పర్సోనేషన్ కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎకనామిక్స్, ఫిజిక్స్ పేపర్–1 ఎగ్జామ్స్ కి 3,059 మంది స్టూడెంట్స్ గైర్హా జరైనట్టు డీఐఈవో సుధారాణి తెలిపారు. మొత్తం 62,918 మంది ఎగ్జామ్స్ రాయాల్సి ఉండగా..59,859 మంది స్టూడెంట్స్ అటెండ్ అయినట్టు ఆమె తెలిపారు.