
హృతిక్ రోషన్ ( Hrithik Roshan ), జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ), కియారా అద్వానీ ( Kiara Advani ) కలిసి నటించిన అత్యంత భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2' ( War 2 ). సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ( Ayan Mukerji ) బుధవారం ( జూలై16 , 2025 ) న విడుదల చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్, కియారా అద్వానీ ఇంటెన్స్ లుక్ లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. లైకుల వర్షం కురిపించేస్తున్నారు.
Also Read:-సినిమా రివ్యూలపై విశాల్ సంచలన వ్యాఖ్యలు.. మొదటి 3 రోజులు సమీక్షలు వద్దే వద్దు!
అయాన్ ముఖర్జీ పోస్టర్ విడుదల
అయాన్ ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీలతో కూడిన పోస్టర్‌ను పంచుకుంటూ, "ఈ సంవత్సరం అతిపెద్ద షోడౌన్ లోడింగ్... #30DaysToWar2 #War2 ఆగస్టు 14 నుండి థియేటర్లలో మాత్రమే. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది" అని క్యాప్షన్ ఇచ్చారు. అటు ఈ పోస్టర్లను జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తన X ఖాతాలోనూ పోస్ట్ చేశారు. ఈ ఒక్క ఫిక్స్ తో 'వార్ 2'పై అంచాలు మరింత రెట్టింపు అయ్యాయి. మరోవైపు జూలై 15న కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ మొదటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కియారా ప్రెగ్నెన్సీ తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా 'వార్ 2' కావడం విశేషం..
ట్రైలర్‌కు రంగం సిద్ధం.
ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో ఆరవ పార్ట్. ఈ 'వార్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో మూవీ మేకర్స్ అధికారిక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు మూడు నిమిషాలతో కూడిన థియేట్రికల్ ట్రైలర్ లను డిజైన్ చేస్తున్నారు. ఇది వచ్చే వారం మధ్యలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా 'వార్ 2' ఆగస్టు 14న విడుదల కానుంది. ఇదే రోజు రజనీకాంత్ ( Rajinikanth ) 'కూలీ' , ( Coolie) మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి మరి..