Vishal: సినిమా రివ్యూలపై విశాల్ సంచలన వ్యాఖ్యలు.. మొదటి 3 రోజులు సమీక్షలు వద్దే వద్దు!

Vishal:  సినిమా రివ్యూలపై విశాల్ సంచలన వ్యాఖ్యలు..  మొదటి 3 రోజులు సమీక్షలు వద్దే వద్దు!

సినిమా రివ్యూలు, పబ్లిక్ రియాక్షన్ లపై తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.  సినీ ఇండస్ట్రీ బతకాలంటే కొన్ని హద్దులు కూడా పెట్టుకోవాల్సి ఉందన్నారు. 'రెడ్ ఫ్లవర్' మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ.. చిత్రసీమను బతికించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.  సినిమాలు విడుదలైన వెంటనే థీయేటర్లకు వచ్చిన ప్రేక్షకుల నుంచి రియాక్షన్స్ తీసుకోవడం సరికాదని హితవు పలికారు.  ఈ పద్దతిని మానుకోవాలని యూట్యూబర్ లకు , మీడియాకు సూచించారు. 

ఇక నుండి సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల పాటు థియేటర్ల వద్ద ప్రేక్షకుల సమీక్షలను రికార్డు చేయడం నిషేధించాలని విశాల్ కోరారు. ప్రతి వారం ఎన్నో సినిమాలు  విడుదలవుతుంటాయి.  సినిమా రిలీజైన వెంటనే యూట్యూబర్లు, మీడియా థీయేటర్ల వద్ద పబ్లిక్ రియాక్షన్ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల  ఒక కొత్త సినిమాకు రావాల్సిన ఆదరణ కూడా రావడం లేదు.  మూవీకి సరైన అవకాశం కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read:-'వార్ 2' కౌంట్‌డౌన్ షురూ.. హృతిక్, ఎన్టీఆర్, కియారా పోస్టర్‌తో అంచనాలు పీక్స్!

కొత్త చిత్రాలకు ప్రాణం పోయాలంటే, మొదట్లోనే ప్రతికూల అభిప్రాయాలతో ఆ చిత్రాన్ని దెబ్బతీయకూడదనేది తన ఉద్దేశమని  విశాల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.  విడుదలైన చిత్రం కనీసం 12 షోలు పూర్తయ్యే వరకూ ఇలాంటి రివ్యూలు చేయడపోవడం మంచిది. సినిమాలు బతికేందుకు రివ్యూలు దోహదపడాలని సూచించారు. సినీ పరిశ్రమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీడియా, యూట్యూబర్లు థీయేటర్ల వద్ద  ప్రేక్షకులకు అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. అవసరమైతే థీయేటర్ల యాజమాన్యం వారిని రాకుండా కట్టడి చేయాలని కోరారు. 

తన పెళ్లి విషయంపై మాట్లాడుతూ.. మరో రెండు నెలల్లో గుడ్ న్యూస్ చెబుతానని విశాల్ అన్నారు. నడిగర్ సంఘం  బిల్డింగ్ పనులు చివరి దశకు వచ్చాయి.  ఇవి రెండు నెలల్లో పూర్తవుతాయి. నా పుట్టిన రోజు గుడ్ న్యూస్ చెబుతా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా అని వెల్లడించారు. నటి సాయి ధన్సికతో విశాల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.  అటు విశాల్ పెళ్లి వార్తపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.