సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసే మాస్‌‌‌‌ యాక్షన్‌‌‌‌తో..‘మాస్‌‌‌‌ జాతర’

సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసే మాస్‌‌‌‌ యాక్షన్‌‌‌‌తో..‘మాస్‌‌‌‌ జాతర’

రచయితగా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన భాను భోగవరపు.. ‘మాస్‌‌‌‌ జాతర’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  రవితేజ, శ్రీలీల జంటగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 31న సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్‌‌‌‌తో థియేటర్స్‌‌‌‌కు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు భాను ఇలా ముచ్చ టించాడు.  

‘‘వినోదంతో పాటు మాస్‌‌‌‌ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా ఇది. రవితేజ గారిని దృష్టిలో ఉంచుకుని రాసిన కథ ఇది. రైల్వే పోలీస్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో మాస్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ అంశాలు ఉంటూనే ఓ కొత్త పాయింట్‌‌‌‌ను ఇందులో టచ్ చేశాం. ఇందులో చూపించిన క్రైమ్‌‌‌‌, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. థియేటర్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకులు సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అవుతారు. ఈ టైటిల్‌‌‌‌ను రవితేజ గారే సూచించారు. రవితేజ గారి అభిమానిగా ఆయన ఖాకీ డ్రెస్‌‌‌‌ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో తెలుసు కనుక ఆ అంచనాలను అందుకునేలా స్క్రిప్ట్‌‌‌‌ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నా.  

ఇక ఈ స్టోరీ కోసం పలువురు రైల్వే పోలీస్‌‌‌‌ అధికారులతో మాట్లాడి కొంత రీసెర్చ్ చేశాను. వాటి స్ఫూర్తితో కొన్ని సీన్స్‌‌‌‌ రాసుకున్నా. రవితేజ గారి ఐకానిక్ మూమెంట్స్‌‌‌‌ను సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇడియట్‌‌‌‌, వెంకీ లాంటి సినిమాల  రిఫరెన్స్‌‌‌‌లు పెట్టడం జరిగింది. ఇక తులసి అనే పాత్ర అనుకోగానే మా అందరికీ శ్రీలీల గుర్తొచ్చారు. తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గత చిత్రాలతో పోలిస్తే ఆమె కొత్తగా కనిపిస్తారు. 

‘గ్యాంగ్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌’లో చిరంజీవి, విజయశాంతి గార్ల కాంబినేషన్‌‌‌‌ మాస్‌‌‌‌ టచ్‌‌‌‌ గుర్తొస్తుంది. శివుడు అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ విలన్‌‌‌‌గా నవీన్ చంద్ర ఆ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. సినిమా రిలీజ్ తర్వాత తన గురించి మాట్లాడుకుంటారు. రాజేంద్రప్రసాద్ గారితో సహా అన్ని పాత్రల మధ్య డ్రామా చక్కగా కుదిరింది. అందుకే అందరూ అంత నమ్మకంగా ఉన్నారు. భీమ్స్‌‌‌‌ గారు ఇచ్చిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి.  

ఆరున్నర కోట్లతో రైల్వే స్టేషన్ సెట్ వేయించడం మొదలు ఖర్చుకు వెనకాడకుండా నాగవంశీ గారు నిర్మించారు. ఇక ప్రస్తుతం రచయితగా కొనసాగుతూనే దర్శకుడిగా రెండో సినిమాకు స్టోరీ రెడీ చేసుకుంటున్నా’’.