MassJathara: ‘మాస్ జాతర’ రిలీజ్ అప్డేట్.. ఫ్యాన్స్కి మాస్రాజా కిక్ ఇచ్చేది అప్పుడే!

MassJathara: ‘మాస్ జాతర’ రిలీజ్ అప్డేట్.. ఫ్యాన్స్కి మాస్రాజా కిక్ ఇచ్చేది అప్పుడే!

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’.  సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

వినాయక చవితికి విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు కొత్త రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. బుధవారం నిర్మాత నాగవంశీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

దసరా సందర్భంగా అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 2న విడుదల తేదీని ప్రకటించనున్నామని చెప్పారు. అలాగే ఆరోజు నుంచి బ్యాక్ టు బ్యాక్‌‌‌‌ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో ప్రమోషన్స్‌‌‌‌ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. రవితేజ లాంటి ఎనర్జిటిక్ స్టార్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రేక్షకులు ఆశించే ఫుల్‌‌‌‌ మాస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ రాబోతోందని నాగవంశీ చెప్పారు.

అక్టోబర్ నెలాఖరులో సినిమా రాబోతోందనే ప్రచారం జరుగుతోంది. మరి అదే టైమ్‌‌కు వస్తారా మరో డేట్‌‌‌‌కు ఫిక్స్‌‌‌‌ అయ్యారా అనేది దసరా రోజున రివీల్ కానుంది. రవితేజ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 75వ చిత్రం. శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.