మెగా 154లో మాస్ మహరాజా

మెగా 154లో మాస్ మహరాజా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా,  బాబీ(కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్  హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్ధ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజ కీరోల్ ప్లే చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. షూటింగ్ లో రవితేజ జాయిన్ అయినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.  'ద మాస్ ఫోర్స్ జాయిన్స్ ద మెగా స్టార్మ్’ అనే కాప్షన్ తో చిన్న టీజర్ ను కూడా వదిలారు. అన్నయ్య  సినిమాలో చిరుకి తమ్ముడిగా నటించిన రవితేజ.. మళ్లీ 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రవితేజ ఎంట్రీతో  సినిమా పైన క్రేజ్ కూడా పెరిగింది.  అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్   ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.