ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్‌లోని హంటింగ్‌డన్ రైల్వే స్టేషన్‌లో రైలులో ప్రయాణికులపై కత్తితో దాడి చేశారు డుండగులు. శనివారం(నవంబర్2) రాత్రి జరిగిన ఈ దాడిలో 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. శనివారం తెల్లవారు జామున కేంబ్రిడ్జి యూనివర్సిటీ సమీపంలోని హంటింగ్ డన్ రైల్వే స్టేషన్ నుంచి రైలు లండన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలు హంటింగ్ డన్ స్టేషన్లోకి ప్రవేశించగానే అత్యవసర సేవలు అందించారు పోలీసులు.
ఏం జరిగింది..?
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది దుండగుల పెద్ద పెద్ద కత్తులతో రైలు ప్రవేశించి.. వారిలో ఒకరు కత్తితో విచక్షణారహితంగా ప్రయాణికులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో గాయపడ్డ ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. ప్రయాణికులు కొందరు టాయిలెట్లలో దాక్కున్నారు. 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. రక్తంతో రైలు బోగీ తడిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పోలీసులు ఏం చెప్పారు?
దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఆదివారం తెల్లవారుజామున బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు (BTP) కూడా కత్తిపోట్లను అత్యంత భయంకరమైన దాడిగా ప్రకటించింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారితో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దాడి వెనక టెర్రరిస్టులు ఉన్నారా అనేకోణంగా విచారణ సాగుతోందని BTP తెలిపారు.
BREAKING: Major incident unfolding as up to 10 people stabbed on a train in Huntington, Cambridgeshire. pic.twitter.com/KYC7aN68QQ
— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) November 1, 2025
