తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. గోవిందరాజ స్వామి ఆలయం పక్కనే..

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. గోవిందరాజ స్వామి ఆలయం పక్కనే..

తిరుపతి పట్టణంలో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2023, జూన్ 16వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. ఓ ఫొటో ఫ్రైమ్ షాపులో ముందుగా మంటలు చెలరేగాయి. ఆ వెంటే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. భక్తులతోపాటు జనం రద్దీగా ఉండే ప్రాంతం కావటంతో చుట్టుపక్కల జనం అంతా పరుగులు తీశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. మంటలను అదుపు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం.. గాలులు వీస్తుండటంతో మంటలను అదుపు చేయటం కష్టంగా మారింది. అగ్ని ప్రమాదం జరిగిన భవనం చుట్టూ.. ఎక్కువగా షాపులు ఉన్నాయి. ఫొటో ఫ్రైమ్ షాపులు, పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు ఉన్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది.. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా పంపిస్తున్నారు. ఆరు ఫైరింజన్లు, నీళ్ల ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. స్థానికులు ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని కోరుతున్నారు.