బాణాసంచా పేలుళ్లతో ఢిల్లీలో భారీగా పెరిగిన వాయుకాలుష్యం 

బాణాసంచా పేలుళ్లతో ఢిల్లీలో భారీగా పెరిగిన వాయుకాలుష్యం 

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అంతకంతకు పెరుగుతోన్న ఎయిర్ పొల్యూషన్ నగరవాసులను ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా పేలుళ్లతో వాయుకాలుష్యం భారీగా పెరిగిందని తెలిపారు అధికారులు. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత 352గా నమోదైంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ 3వందల కంటే ఎక్కువగానే రికార్డు అయింది. ఇవాళ సాయంత్రం  వాయు కాలుష్యం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. నవంబర్ 7తర్వాతే గాలుల వేగం పెరిగి ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నారు.