తిరుమల ఘాట్ రోడ్డుపై కొండను ఢీకొన్న టెంపో : నలుగురు భక్తులకు గాయాలు : 4 గంటల్లో 2వ ప్రమాదం..

తిరుమల ఘాట్ రోడ్డుపై కొండను ఢీకొన్న టెంపో : నలుగురు భక్తులకు గాయాలు : 4 గంటల్లో 2వ ప్రమాదం..

తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టెంపో ట్రావెలర్ అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. శుక్రవారం ( ఆగస్టు 22 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుమల నుండి తిరుపతి వస్తున్న ఓ టెంపో మొదటి ఘాట్ రోడ్డు మలుపు దగ్గర కొండను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 10 మంది పెద్దలు, ముగ్గురు పిల్లలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విజిల్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

►ALSO READ | శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం... పెద్దఎత్తున హాజరైన మహిళలు...

అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న టెంపో ఒక్కసారిగా కొండను ఢీకొనడంతో ఆందోళనకు గురయ్యారు భక్తులు. అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ తిరుమలలో 4 గంటల్లోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.