
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ( ఆగస్టు 22 ) జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు ప్రాంతాలకు చెందిన 90 గూడెంల నుంచి 650 మంది చెంచు ముత్తైదువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ఐటీడీఏ పీవో శివప్రసాద్ దంపతులు పాల్గొన్నారు.
ఐదవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 650 మంది చెంచు గిరిజన మహిళలు, ముత్తైదువులు అలానే 1000 మంది సాధారణ మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు.
►ALSO READ | ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.70 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన వనస్థలీపురం సబ్ రిజిస్ట్రార్
వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరపున ఉచితంగా వ్రత పూజా సామాగ్రి, చీర, రవిక వస్త్రం అందజేశారు. అనంతరం మహిళలకు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆలయ ఈవో.
మన వైదిక సాంప్రదాయంలో శ్రావణ మాస వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. ధార్మిక కార్యక్రమంలో భాగంగా దేవస్థానం తరపున వరలక్ష్మి వ్రతం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గిరిజన చెంచు సోదరి మనులకు అవకాశం కల్పించామని.. చెంచు ముత్తైదులను ఎంపిక చేయడంలో ఐటీడీఏ అధికారుల సహకారం అందించారని అన్నారు ఆలయ ఈవో.